బండారుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు*
మిల్లర్లతో సిండికేట్ అయిన లక్ష్మీ గణపతి రైతు సంఘం
ములుగు జిల్లా బ్యూరో: ఏప్రిల్ 21( నంది పత్రిక)
ములుగు జిల్లా బండారిపల్లి గ్రామంలోని రైతులు ఆరుకాలం పండించిన పంటకు మధ్యధరా ప్రకటించిన ప్రభుత్వం రైతు సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడము ప్రభుత్వానికి మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. రైతు సంఘ సభ్యులు అభివృద్ధి చెందుతారని ప్రభుత్వము వారికి అప్పజెప్పడంతో పాటు వారిపై ప్రభుత్వం కూడా కొంత కన్నేసి ఉంచాలి అన్నదే రైతుల అభిప్రాయం. బండారుపల్లి గ్రామంలో లక్ష్మీ గణపతి రైతు సంఘం వారు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులు పండించిన పంటకు ధాన్యం కొనుగోలు విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వం నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ధాన్యాన్నివిక్రయిస్తున్న లక్ష్మీ గణపతి రైతు సంఘం మిల్లర్ కమిట్మెంట్ తీసుకొని రైతుల దగ్గర కటింగ్ చేయించారు
రైతుల యొక్క ఆవేదన అర్థం చేసుకోండి* ప్రభుత్వం నిర్వహించే దాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యాన్ని విక్రయిస్తున్నాము. అట్టి ధాన్యం కొనుగోలు కేంద్రం గత ఖరీఫ్ సీజన్ 2024-2025 లో లక్ష్మి గణపతి రైతు సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు చేయించడం జరిగినది. కానీ ఆ సీజన్ లో ఆ సంఘం నిర్వాహకులు మాకు ధాన్యం రైస్ మిల్లర్లు కటింగ్ లేకున్నా తీసుకున్న అట్టి ధాన్యం డబ్బులను ఒక క్వింటాకు 5 కేజీ లు చొప్పున కటింగ్ చేసి పేమెంట్ చేసినారు. మేము అడిగితే కటింగ్ లేకుండా లారీలు పంపలేదని నిర్లక్షంగా సమాదానాలు చెప్తున్నారు. ఇలా ప్రతి రైతు విషయం లో లేని కటింగ్ ఎక్కువగా చెప్పి ధాన్యం రైస్ మిల్లర్ కట్ చేసిన దానికంటే ఎక్కవగా కట్ చేసి రైతులను ఇబ్బందులకు గురి చేసినారు.
కావున ప్రస్తుత సీజన్ 2024 2025 రబీలో లక్ష్మి గణపతి రైతు సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ను రద్దు చేసి ములుగు పిఎసిఎస్ అద్వర్యం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రైతులకు ధాన్యం కొనుగోలు లో మరల నష్టం కలుగకుండా బండారుపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు
Comment List