మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
కేసముద్రం, ఏప్రిల్ 26(నంది పత్రిక): ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే ను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి సారథి పిలుపునిచ్చారు. శనివారం కేసముద్రం మండలంలోని పెద్ద మోరి తండ లోని కొత్తూరు లో సిపిఐ మండల సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బి విజయ సారధి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ బహుళ జాతి సంస్థలకు వత్తాసు పలుకుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఊడిగం చేస్తుందన్నారు. అనేక సంవత్సరం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు, యాజమాన్యాలకు తొత్తుగా మారిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చి రైతులను తన భూముల్లోనే కూలిగా మార్చే విధానాలను తెచ్చిందన్నారు. మేడే స్పూర్తితోనే కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలపై ఐక్యంగా ఉద్యమ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్, ఎస్కే ఇమామ్, ఉపేందర్, సామ సారయ్య, సుధాకర్, గురువయ్య, నరేందర్, నల్లమాస వీరస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు.
Comment List