డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి

On

దళిత పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి.. అని గుర్తిండిపోయేలా చట్టం చేశారు    

అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలి... 

అంటరానితనాన్ని రూపుమాపిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.....

 జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్                         

IMG-20250414-WA0034

 ములుగు జిల్లా బ్యూరో : ఏప్రిల్ 14 ( నంది పత్రిక )

 భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని, వారు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగానే ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని జిల్లా గ్రంధాలయ చైర్మన్ భానోత్ రవిచందర్ అన్నారు. ప్రపంచ మేధావి బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు (స్థానిక సంస్థల) కలెక్టర్ సంపత్ రావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముందు అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో రవిచందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత పక్షపాతిగా కొనసాగుతున్నారని, అంటరానితనాన్ని రూపుమాపిన మహావ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. కులాలకు మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రూపొందించి అన్ని వర్గాల వారికి సమానత్వం ఉండే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు. 

దళితుల కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేమని, దళితుల వెనుకబడుతనాన్ని రూపుమాపేందుకు పట్టుబట్టిన విక్రమార్కుల కృషి చేశారని అన్నారు. 

జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా అదనపు (స్థానిక సంస్థల )కలెక్టర్ సంపత్ రావు మాట్లాడుతూ కార్యక్రమంలో కలెక్టర్ కచ్చితంగా పాల్గొంటారని అనుకున్నప్పటికీ నేడు హైదరాబాద్ లో జరిగిన సమావేశానికి హాజరు కావలసి ఉండగా కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని, దళిత సంఘాల నాయకులు చెప్పిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుపోనున్నట్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి త్యాగం ఎన్నటికీ మరువలేమని, నేటి విద్యార్థులు యువత ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలని సూచించారు. 

దేశంలో గొప్ప నాయకుల కృషిని వారి మరణ అనంతరమే విగ్రహాలు ఏర్పాటు చేస్తారని, అంబేద్కర్ బతికుండగానే ఆయన చేసిన సేవలను గుర్తించి 1950లోనే విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. 

అంబేద్కర్ ఏర్పాటు చేసుకున్న లైబ్రరీలో 50 వేల పుస్తకాలను పొందుపరచుకొని వాటిని పఠనం చేశారని, వీధిలైట్ల మధ్య విద్యాభ్యాసం చేసి గొప్ప వ్యక్తిగా ఎదిగారని కొనియాడారు. 

తక్కువ సమయంలోనే ఉన్నత చదువు చదివి లండన్ ఎకనామిక్ పట్టాను పొందారని, విద్య నేర్చుకోవడం ద్వారానే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. 

చదువు నేర్చుకోవడంలో విద్యార్థులు నిర్లక్ష్యం వాయించవద్దని, విద్యతోనే తలరాతలు మారుతాయి అని అన్నారు. 

అంతకుముందు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దగ్గర ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి 

జిల్లా గ్రంధాల చైర్మన్ బానోతు రవి చందర్, జిల్లా అదనపు ( స్థానిక సంస్థల ) కలెక్టర్ ఏం సంపత్ రావు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి లక్ష్మణ్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, దళిత సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులతో ప్రజాస్వామ్యవాదులు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ కి పువ్వుల మాలలతో ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులముల వెల్ఫేర్ అధికారి ఎస్ లక్ష్మణ్,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి , డి సి ఓ సర్దార్ సింగ్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, కలెక్టరేట్ కార్యాలయ ఏవో రాజ్ కుమార్ , జేఏసీ అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ సభ్యులు జన్ను రవి, చుంచు రవి, మహేష్ నాయక్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నక్క బిక్షపతి, ఎమ్మార్పీఎస్ నాయకులు ఇరుగుపైడి, నెమలి నరసయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బురి సతీష్,మాజీ సర్పంచ్ గుగ్గిళ్ళ సాగర్, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ప్రధాన కార్యదర్శి నూనె రాములు, తెలంగాణ నిరుపేదల సంక్షేమ సొసైటీ నాయకులు కొట్టేపాక ప్రభాకర్, మేడిపల్లి శ్యాము ప్రజాసేన వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మ కంటి రమేష్ వర్మ, చిందు హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకులు హైమద్ పాషా, సిపిఐ నాయకులు జంపాల రవీందర్, సారంగపాణి రజక హక్కుల పోరాట సమితి అధ్యక్షులు, బీసీ అధ్యక్షులు చింత నిప్పుల బిక్షపతి,అంబేద్కర్ వాదులు వివిధ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

మంత్రుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ మంత్రుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
      ములుగు జిల్లా బ్యూరో : ఏప్రిల్ 17( నంది పత్రిక ) భూభారతి పోర్టల్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన
పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించండి
ప్లేస్‌మెంట్‌లో పెద్ద విజయం – నేషనల్ డిగ్రీ కళాశాల నుంచి 70 మంది మల్టీనేషనల్ కంపెనీలకు ఎంపిక
సంస్కరణల మధ్య ఆధునికతకి మరో అడుగు  – ఎఐఎంఎల్ ల్యాబ్ ప్రారంభం
గుడుంబా స్థావరాలపై దాడులు చేసిన ములుగు పోలీస్ 
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి
డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి