మంత్రుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు జిల్లా బ్యూరో : ఏప్రిల్ 17( నంది పత్రిక )
భూభారతి పోర్టల్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన వెంకటాపూర్ మండల కేంద్రం లో శుక్రవారం నిర్వహించే భూ భారతి రెవెన్యూ సదస్సు కు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నందున నేపధ్యంలో వెంకటాపూర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణం లో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పర్యవేక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన సందర్భంగా రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని వెంకటాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా శుక్రవారం రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భారతి రెవిన్యూ సదస్సును మండల కేంద్రం లో ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా వెంకటాపూర్ లో ఏర్పాట్ల ను కలెక్టర్ దగ్గరుండి పరిశీలించారు. మంత్రులు పాల్గొనే భూభారతి సదస్సుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ సదస్సుల ఇంచార్జీ ఆఫీసర్ ఎస్. కిరణ్ ప్రకాష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ఆర్డిఓ వెంకటేష్, ఎం పి డి ఓ రాజు, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List