12 న చలో విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి

On

IMG_20250307_122021
జూపాడుబంగ్లా ఫిబ్రవరి 6 (నంది పత్రిక) జాతీయ ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల పండుగ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి కూలీలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక నాయకుడు కర్ణ పిలుపునిచ్చారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం సంఘం ఆధ్వర్యంలో గురువారం 80 బన్నూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  శ్రీనివాసులు కరుణ మాట్లాడుతూ ఐదు వారాలుగా ఉపాధి హామీ  కార్మికులకు వేతనాలు చెల్లించ లేదన్నారు. ప్రతివారం వేతనాలు చెల్లించాలని పని ప్రదేశంలో కార్మికులు వినియోగిస్తున్న పనిముట్లకు డబ్బులు ఇవ్వాలని మంచినీరు టెంట్లు మెడికల్ కిట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రోజుకు కనీస వేతనం రూ 600 ఇవ్వాలని 200 దినాలు కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వర్యం చేయడానికి జాబ్ కార్డు తొలగించి పని లేకుండా చేయడం దారుణం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. చలో విజయవాడ కార్యక్రమానికి ఉపాధి హామీ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News