నిరుపేదలకు ఆధునిక వైద్యం అందించాల్లన్నదే లక్ష్యం.

On


-ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఉచిత వైద్య శిబిరంకు విశేష స్పందన

GridArt_20250420_214306928

నందికొట్కూరు. ఏప్రిల్ 20 . (నంది పత్రిక ):నిరుపేదలకు ఆధునిక వైద్యం అందించాల్లన్నదే లక్ష్యమని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డిలు అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొణిదేల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డిల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించచారు.చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా వైద్య శిబిరం వద్దనే టీడీపీ నాయకులు, బైరెడ్డి అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో హైదరాబాద్ కు చెందిన వివిధ విభాగాల వైద్య నిపుణులు డాక్టర్ సోమేశ్వరరెడ్డి, డాక్టర్. కె ఎస్ సోమేశ్వరరావు, డాక్టర్ జితేందర్ జైన్, డాక్టర్. బి. అనుషా, డాక్టర్. మల్లికార్జున, డాక్టర్. జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ బైరెడ్డి శబరి, డాక్టర్ శివ చరణ్ రెడ్డిలు రోగులకు వైద్య సేవలు అందించారు. రక్తం, గళ్ళ, బి పి, షుగర్ తదితర పరీక్షలు కూడా ఉచితంగా అందించారు. కొనిదేల, నాగటూరు, బిజినేముల, నెహ్రూ నగర్, ఎల్లాల, వనములపాడు, లక్ష్మాపురం, పగిడ్యాల, పాత, కొత్త ముచ్చుమర్రి గ్రామాల నుంచి వందల సంఖ్యలో రోగులు ఎంపీ శబరి ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంకు వచ్చారు. వైద్య శిబిరంకు వచ్చిన పేద రోగులకుకు పరీక్షలు, ఉచితంగా అవసరమైన మందులు, భోజన వసతులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డి లు కల్పించారు. కర్నూలు సుశీల నేత్రాలయం వైద్య బృందం, చిన్న పిల్లల వైద్య బృందాలు రోగులకు వైద్య సేవలు అందించారు.ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ప్రజలందరి దీవెనలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉండాలని, మంచి పాలన అందించేందుకు సీఎం కు మనోభలం, దైర్యం ప్రజలు ఇవ్వాలని ఆమె కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 
మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  
శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత
రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి