దోపిడీలు, బందిపోటు దొంగతనము కేసులలో ముద్దాయి అరెస్టు
-05 తులాల బంగారు 30 తులాల వెండి 12 వేల నగదు స్వాధీనం
-నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 14 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు, నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ కుమారి మంద జావళి ఆల్పోన్స్ ఆద్వర్యంలో పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి ,ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి , పాణ్యంసిబ్బంది బాష,రఫి, నాగార్జున, వెంకటేశ్వర్లు, సూర్య, క్రిష్ణ మరియు సిబ్బంది చంద్ర శేఖర్, ఇబ్రహిం, యేసుదాసు గంగారం, కృష్ణయ్య నాయుడు, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, నాగరాజు, మాలిక్ బాష మరియు ఇస్మాయిల్ లు 2019 వ సంవత్సరము నుండి ఇప్పటి వరకు నంద్యాల మరియు గుంటూర్ జిల్లాల పోలీసు స్టేషన్ల పరిధిలలో బందిపోటు, దోపిడీలు, మరియు దొంగతనాలకు పాల్పడుతూ పోలీస్ లకు దొరకకుండా తప్పిoచుకొని తిరుగు తున్న పాణ్యం చెంచు కాలనీకి చెందిన మరియు ప్రస్తుతము పాములపాడు మండలము వేంపెంట గ్రామము, జగన్ కాలనీలో నివాసము ఉంటున్న చెంచు మేకల హనుమంతు @ హనుమంతు, వయస్సు 25 సంవత్సరములు అను అతనిని ఈ దినము అనగా 14.04.2025 వ తేది సాయంత్రము 4.30 గంటల సమయములో పాణ్యం మండలము, సుగాలిమెట్ట గ్రామము సమీపంలో గల జంబులమ్మ గుడి ఆర్చి వద్ద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి బంగారు మరియు వెండి ఆభరణములను మరియు కొంత నగదును సీజ్ చెయ్యడమైనది.ముద్దాయి మేకల హనుమంతు చెంచు దాసరి అంకన్న, చెంచు సుంకన్న మరియు చెంచు దాసరి హరిచంద్రుడు @ హరిచంద్ర @ చంద్ర అను వారితో కలిసి జల్సాలకు అలవాటు పడి పాణ్యం మరియు నంద్యాల చుట్టు పక్కల గ్రామములలో రాత్రి సమయములలో పరిధిలలో బందిపోటు, దోపిడీలు మరియు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్మును సమానముగా పంచుకొనేవారు. వీరు గతంలో నంద్యాల జిల్లాలోని పాణ్యం, నంద్యాల తాలూకా, బండిఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిదిలలో సుమారు 21 బందిపోటు, దోపిడి మరియు దొంగతనం కేసులలో మరియు గుంటూరు జిల్లాలో కూడా బందిపోటు మరియు దారి దోపిడిలు చేసినారు, ఇతనితో పాటు గుంటూరు జిల్లాలో బందిపోటు, దారి దోపిడి చేసిన (1) ఆకుల లింగమయ్య, (2) దాసరి ఓబులేసు (3) దాసరి లింగమయ్య (4) ఇండ్ల రమణయ్య లకు మేడికొండనురు పోలీసు స్టేషన్ పరిధిలో చేసిన నేరములకు యావజ్జీవ శిక్ష పడినది. అదే విదముగా ఈదలపాడు పోలీసు స్టేషన్ పరిధిలో చేసిన రెండు కేసులలో ఒక్కొక్క కేసులో 7 సంవత్సరముల శిక్ష పడింది. ఇతను చాలా రోజుల నుండి కేసులలో ముద్దాయి అయినప్పటికి ఎవరికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతు నేరములు చేస్తూ ఉన్నాడు. ఈ సందర్బంగా కర్నూల్ డిఐజి కోయల ప్రవీణ్ కుమార్ , నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా , నంద్యాల ఏ ఎస్పీ యగంధర్ బాబు మరియు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ కుమారి మంద జావళి ఆల్పోన్స్ నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషిoచిన పోలీస్ ఆపీసర్స్ ను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకముగా అభినందించడమైనది.
Comment List