అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం

On

  • అకాల వర్షం,పెనుగాలులకు అరటి,వరి పంట నేలపాలు
  • అప్పులు ఎలా కట్టాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు 

GridArt_20250404_201806045

మహానంది,ఏప్రిల్ 04 (నంది పత్రిక):-

రైతులు ఏడాదంతా కష్టపడి పండించిన పంటను గాలివాన నేలకొడిగేలా చేసింది.పంట కోతలు మొదలుపెట్టి అమ్ముకుందామని ఆశించిన అన్నదాతకు కడగండ్లను మిగిల్చింది.లక్షల పెట్టుబడి, ఏడాది శ్రమ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోవడంతో వరి, అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మహానంది మండలంలోని మహానంది, అల్లినగరం, శ్రీనగరం బుక్కాపురం తిమ్మాపురం, బొల్లవరం పలు గ్రామాలలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి,అరటి పంటలు నేలవారిపోయాయి. లక్షల పెట్టుబడి పెట్టి ఏడాది కష్టకాలం ఒక్క రాత్రి తో తలకిందులు అవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. కొందరు రైతులు వరి కోసి దాన్యం రాశులుగా పోసుకొని ఆరబెట్టుకుంటున్న సమయంలో అకాల వర్షానికి తడిసి ముద్దయిపోయి, ఆరుగాలం పండించిన పంట కళ్ళముందే తడిసి ముద్ద అవుతుంటే వరి రైతుల బాధ వర్ణనాతీతమైపోయింది.అదేవిధంగా బుక్కాపురం, తిమ్మాపురం, మహానంది గ్రామాలలో పలు రైతుల అరటి పంటలు నేలకు విరిగిపడ్డాయి. ఏడాది కాలం కష్టపడి అరటి గెల మరో నెలలో కోసి సొమ్ము చేసుకుందామనీలోపే వానగాలికు నేలకొరిగిపోయి .రైతును తలకిందులు చేసింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అని రైతు దినస్థితిలో ఉండిపోవడం జరిగింది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సంబంధిత ఉద్యాన శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని, అసలు ఉద్యాన శాఖ అధికారులు మండలంలో ఉన్నారా? లేదా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.ఆరుగాలం శ్రమించి కష్టానికి నష్టానికి చెమటోడ్చి ,అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పండిన పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.కానీ పాలకులకు మాత్రం రైతుల కష్టనష్టాలు కనపడవా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.ప్రజాప్రతినిధులు వేదికలపై మాత్రమే రైతులకు అండగా ఉంటామని,ప్రభుత్వపరంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీలు గుప్పిస్తూనే ఉంటారు.మహానంది,బండి ఆత్మకూరు మండలాల్లో ఖరీఫ్ సీజన్లో వరి మరియు మొక్కజొన్న రైతులకు తుఫాను మరియు పెనుగాలుల వల్ల తీవ్రంగా నష్టపోయారు. కానీ నేటికీ కూడా రైతులకు ఆర్థిక సహాయం సహాయం అందలేదు.కారణం పెనుగాలులు విచాయి గాని అత్యధిక వర్షపాతం నమోదు కాలేదని ఈ కారణం చేతనే రైతులకు అందాల్సిన సహాయం అందలేదని తెలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన ప్రజాప్రతినిధుల్లో కానీ,ఉన్నత స్థాయి అధికారుల్లో కానీ చలనం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.ఏది ఏమైనా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

వర్షాలకు 1000 ఎకరాల్లో వరి పంట నష్టం  వర్షాలకు 1000 ఎకరాల్లో వరి పంట నష్టం 
మహానంది, ఏప్రిల్ 11 (నంది పత్రిక):-మహానంది మండలంలోని తమ్మడపల్లె,బొల్లవరం గ్రామాలలో  గాలి వర్షానికి పడిపోయిన వరి పొలాలను నంద్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు రాజశేఖర్ శుక్రవారం సందర్శించారు.ఈ...
జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి
అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సైనిక సంక్షేమ శాఖకు  విరాళం
జాబ్ మేళ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోవాలి
శ్రీశైలంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలకు పిఎన్టి ల్యాబ్ కు ప్రత్యేక గౌరవం