సికింద్రాబాద్‌లో ఆటో డ్రైవర్లకు ఐడీ కార్డులు మరియు యూనిఫార్మ్ పంపిణీ కార్యక్రమం...!!!"

On


GridArt_20250221_223145409

హైదరాబాద్ నందిపత్రిక ఫిబ్రవరి 21:హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఐఎన్‌టీయుసీ అనుబంధం "యూనిటీ" తెలంగాణ ఆటో డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులు మరియు ఆటో డ్రైవర్ల యూనిఫార్మ్ అందజేత కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టిటియుసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, ఆటో డ్రైవర్లకు ఐడీ కార్డులు మరియు యూనిఫార్మ్ లు అందజేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వారికి అన్ని విధాల సహాయం అందించాలని సూచించారు. అలాగే, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఆటో డ్రైవర్లు నగర పోలీసులతో సహకరించాలని, పార్కింగ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.

అదేవిధంగా, మెతి శోభన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అసోసియేషన్ ఆటో డ్రైవర్లకు ఐక్యత మరియు భద్రత కల్పించడంలో ముందంజలో ఉందని, అందరూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు మరియు యూనిఫార్మ్ లు అందించడం గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు హాజరై, తమ సమస్యలను ప్రముఖుల ముందు ఉంచి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు సలీం, మహంకాళి ట్రాఫిక్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ శంకర్, ఏఐటీయూసీ వెంకటేశం గారు, నజీర్, మొహమ్మద్ యూసఫ్, సయ్యద్ అస్లం, అంజి, నరేందర్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News