ఎపి. మోడల్ స్కూల్ విద్యార్థుల సమస్యలనువెంటనే పరిష్కరించాలి.

On

GridArt_20250221_215217591
 - ఎపి. రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి, సుబ్బారాయుడు.
డోన్ నుండి బేతంచెర్ల మండలం మీదుగా ఓర్వకల్ మండలం సోమయాజుల పల్లె వరకు 340 బి నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బేతంచెర్ల మండలం గొర్మానుకొండ గ్రామపంచాయితీ పరిధిలో ఎపి మోడల్ స్కూల్ ఉన్నది. ఈ మోడల్ స్కూల్ మీదుగా సోమయాజుల పల్లె వరకు 340 బి హైవే రోడ్ పనులు జరుగుతున్నందువల్ల పనులకు ఆటంకం కలుగుతున్నందువల్ల, బేతంచెర్ల నుండి బుగ్గానిపల్లె సిమెంట్ నగర్ మీదుగా తమ్మరాజు పల్లె నేషనల్ హైవే కు అక్కడినుండి ఓర్వకల్ మండలం సోమయాజుల పల్లె మీదుగా కర్నూలుకు బస్ సర్వీసులు తిరుగు తున్నాయి మోడల్ స్కూల్లో చదివే విద్యార్థులకు బస్ సౌఖర్యాలు లేకుండాపోయాయి.   అలాగే బేతంచెర్ల మండలంలోని సీతారామాపురం, శంకరాపురం, బైనపల్లె, ఎంబాయి, మండ్లవాని పల్లె, రుద్రవరం,రైతులు, విద్యార్థులు ప్రజలు బేతంచెర్ల పట్టణానికి రాకపోకలు ఆగిపోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.ఈ హైవే రోడ్ పనులవల్ల  సోమయాజుల పల్లె నుండి బేతంచెర్ల వరకు ఆర్టీసి బస్సులు తిరుగక, మోడల్ స్కూల్ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 10 వతరగతి పరీక్షలు మార్చినెల 17 వతేది ప్రారంభ మగు తున్నందువల్ల  సంబంధిత అధికారులు ఎపి. మోడల్ స్కూల్ విద్యార్థులకు తగు న్యాయం చేయాలని, బేతంచెర్ల ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి గొర్మానుకొండ తాండ దగ్గరున్న మోడల్ స్కూల్ వరకు విద్యార్థి బస్సులు ఎక్కువ సార్లు తిప్పాలని ప్రభుత్వ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి. సుబ్బరాయుడు మండల కార్యదర్శి పి. రామ మోహన్, మండల రైతుసంఘం సీనియర్ నాయకులు ఎన్.   కిష్టన్న, మధు, శ్రీనివాసులు రైతులు పాల్గొన్నారు......,.......................... బనగాన పల్లె ఆర్టీసి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది శుక్రవారం ఉదయం విద్యార్థి బస్ సర్వీస్ పంపారు.హైవే రోడ్ పనులు పూర్తయ్యే వరకు స్కూల్ మోడల్ విద్యార్థులకు రాను, పోను బస్ సోకుఖర్యం కలిపించాలని సంభంధిత అధికారులను కోరారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News