నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
ఎస్విఅర్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు
నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 16 . (నంది పత్రిక ): నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు,నంద్యాల సబ్ డివిజన్ ఎస్డిపిఓ ఎం. జావాలి అల్ఫోన్సా,మార్గదర్శకత్వంలో, B.మల్లికార్జున గుప్త, సీఐ ట్రాఫిక్ నంద్యాల మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సహకారంతో రోడ్ సేఫ్టీ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమం ఎస్విఅర్ ఇంజనీరింగ్ కాలేజ్, నంద్యాలలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో సుమారు 300 విద్యార్థులకు ట్రాఫిక్ ఉల్లంఘనలు, వాటి జరిమానాలు, ప్రమాదాల కారణాలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ప్రమాదాలు చాలా వరకు మానవ తప్పిదాల వల్లనే జరుగుతాయి అని అన్నిరకాలుగా వుంటాయో అని విద్యార్థులకు వివరించడంతో పాటు గోల్డెన్ అవర్ చికిత్స ప్రాముఖ్యత గురించి వివరించారు.హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రభుత్వ ప్రయోజనాలు, భాదితులకు ప్రభుత్వము తరుపునుంచి వచ్చే ప్రయోజనాలు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఇతర కీలక అంశాల గురించి కూడా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం ద్వారా సురక్షిత డ్రైవింగ్ అలవాట్లు అలవర్చుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రమాదాలను నివారించాలని విద్యార్థులకు సందేశాన్ని అందించారు. ఈ అవగాహన కార్యక్రమం మంచి స్పందనను పొందింది మరియు రోడ్డు భద్రతపై బాధ్యతను పెంపొందించడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Comment List