వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవంలో
ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి,,,
నందవరం నంది పత్రిక ఫిబ్రవరి 27:-మహాశివరాత్రి సందర్భంగా నందవరం మండలం గురజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో దర్శించుకుని హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పూలతో అందగా ముస్తాబు చేసిన రథంలో రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఊరేగించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామలింగేశ్వరుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ శాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్ని వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పుల్లయ్య, సీఐ మధుసూదన్ , ఎస్సై శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ రాముడు, కానిస్టేబుల్స్ ఈరన్న, వీరేష్, హనుమంతు, దాస్ , మండల టిడిపి నాయకులు దేశాయ్ గురురాజ్, క్లస్టర్ ఇంచార్జి కాసింవళి, రైస్ మిల్ నారాయణరెడ్డి, సోమల గూడూరు వెంకటరామిరెడ్డి, శివారెడ్డి, రాయచోటే రామకృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ నిర్వాహన అధికారి రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
Comment List