నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి ఎన్ ఎం డి ఫారుక్
నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆదివారం మైనార్టీ మంత్రి ఎన్ ఎం డి ఫారుక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నెరవాటి డాక్టర్ వినోద్ కుమార్,డాక్టర్ అరుణ కుమారిలు నంద్యాల ప్రజలకు సేవలందిస్తున్నారని అన్నారు. ఇప్పుడు నంద్యాలలో నేరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ ఫాతిమాభి స్త్రీ వ్యాధి నిపుణులు, డాక్టర్ కే సుమన్ కుమార్ ఎముకలు కీళ్ల వ్యాధిని నిపుణులు సేవలందిస్తారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త పబ్బతి వేణు మాట్లాడుతూ నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నంద్యాలలో ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Comment List