రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

On

 GridArt_20250428_180854434

ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్
 తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రిక
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక లారీ, ఒక కారు స్వాధీనం చేసుకుని, ఏడుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు  కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ  జి. బాలిరెడ్డి మార్గానిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ సి. వినోద్ కుమార్ టీమ్ ఆదివారం శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసి కాటూరు ఫారెస్ట్ బీటు పరిధిలో  పంగూరు మెయిన్ రోడ్డు దొమ్మరపాళెం వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. సోమవారం ఉదయం ఒక కారు, దాని వెనుక ఒక లారీ కొద్దీ దూరం లో ఆపి, అందులోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చేరుకుని చుట్టుముట్టారు. లారీని పరిశీలించగా అందులో 72 ఎర్రచందనం దుంగలు కమీపించాయి. వాటి విలువ సుమారు రూ. 2.5కోట్లు ఉంటుందని అంచనా వేశారు.  వాహనాల్లో ఉన్న వారిని అరెస్ట్ చేయగా వారిలో నలుగురు తిరుపతి జిల్లాకు చెందిన వారు గాను, మరో ముగ్గురిని తమిళనాడు వాసులుగా గుర్తించారు. వారిని  ఎర్రచందనం దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీలు వీ. శ్రీనివాసులురెడ్డి, షరీఫ్ లు విచారించగా సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 
మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  
శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత
రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి