ఒక్కరోజులోనే బూజు పట్టిన కరుబూజ పండ్లు .

On

IMG-20250421-WA0016

[ రసాయనాలతో మాగేస్తున్న" పండ్లు"

-ఒక్కరోజులోనే బూజు పడుతున్న పండ్లు.

-కరుబుజా,మామిడి,అరటి,బొప్పాయి పండ్లు తింటే ఆరోగ్యం బాగుంటుందా.

...ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న పండ్ల వ్యాపారులు.

...చోద్యం చూస్తున్న అధికారులు.

నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 21 . (నంది పత్రిక ):పండ్లు,కూరగాయలు ఎంతో శక్తిని ఇస్తాయని అంటారు.ప్రస్తుతం పండ్లు తింటే అనారోగ్యాలు ఖాయమని తెలుస్తోంది.వేసవి కాలంలో వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే తాజా పండ్లు,పండ్లరసాలు తీసుకోవాలని వైద్యులు,ప్రభుత్వం సూచిస్తుంది.ఆరోగ్యం కంటే డబ్బు ఎక్కువ కాదని అధిక ధరలు పండ్లు ఉన్నా ఆరోగ్యం కోసం లెక్కచేయకుండా పండ్లు కొనుగోలు చేస్తున్నారు.రసాయనాలతో మోగించిన పండ్లు అని తెలియక ఫ్రెష్ గా కనిపిస్తుండటంతో ప్రజలు పండ్లు కొనుగోలు చేసి వాటి నిజస్వరూపం తెలియక అనారోగ్యాల పాలవుతున్నారు.వివిధ రకాల పండ్లు పక్వానికి రాకముందే పండ్ల వ్యాపారులు కోల్డ్ స్టోరేజీలో రసాయనాలు కలుపుతూ పక్వానికి రాకపోయినా పండ్లు త్వరత గతిన మాగే విధంగా చేస్తుండడంతో కొనుగోలు చేసిన రెండురోజులకే బూజు పట్టడంతో అంత ధర పెట్టీ కొనుగోలు చేసినా బూజు పట్టిన పండ్లను చెత్తబుట్టలో వేస్తున్నారు.ప్రతి ఏటా వేసవికాలం ఇలా పండ్ల వ్యాపారులు రసాయనాలతో పండ్లను మాగేస్తున్నా సంబంధిత అధికారులకు హస్త వాసి బాగా ముట్టచెప్పడంతో తూ, తూ మంత్రంగా తనికీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణ పరిసరాల్లో అరటి,కరుబూజా,మామిడి,బొప్పాయి,కలింగర పండ్ల తోటలు అధికంగా ఉన్నాయి.పండ్ల వ్యాపారుల పోటీ అధికం కావడంతో పక్వానికి రాకముందే రైతుల వద్ద వివిధ రకాల పండ్లను కొనుగోలు చేస్తున్నారు.చెట్టు నుంచి కోసిన పండ్లు ఎక్కువ రోజులు ఉండకపోవడం,కొనుగోలు చేసిన పండ్లను వెంటనే విక్రయించాలని కొందరు పండ్ల వ్యాపారులు కోల్డ్ స్టోరేజుల్లో రసాయనాలు కలుపుతూ పండ్లు పక్వానికి వచ్చేవిధంగా చేస్తున్నారు.హాల్ సేల్ వ్యాపారుల నుంచి రిటైల్ వ్యాపారులు పండ్లను కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్నారు.వేసవి కాలం అంటేనే ప్రజలు అధికంగా మామిడి, కురుబూజా,కలింగర(వాటర్ మిలాన్) పండ్లను ఇష్టపడతారు.సీజన్ ప్రారంభంలో కొత్తగా వచ్చిన పండ్లను రుచిచూడాలని ధరలు ఎక్కువగా ఉన్నా ప్రజలు కొనుగోలు చేస్తారు.ఆశగా ప్రజలు కొనుగోలు చేసిన పండ్లు మొదటి రోజు వాటి రుచిని ఆస్వాదిస్తారు.మరుసటి రోజు పండ్ల నిజస్వరూపం బయటపడుతుంది.కొన్నవారిని ఏమి అనలేక,రసాయనాలు లేని పండ్లు దొరకక ఏరోజుకు సరిపోయే పండ్లను కొనుగోలు చేస్తున్నారు.పంటల్లో అధికంగా ఎరువులు వాడుకం ఒక వైపు,పండిన పండ్లు పక్వానికి రాకముందే రసాయనాలతో పక్వానికి వచ్చే విధంగా చేయడంతో అవేవి తెలియని ప్రజలు ఆరోగ్యం కోసం పండ్లు తిని అనారోగ్యాల పాలవుతున్నారు.సంబంధించిన అధికారులు ఇప్పటికైనా రసాయనాలు తో పండ్లను పక్వానికి తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 
మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  
శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత
రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి