వాహనదారులకు హెల్మెట్ ధరించడం పై అవగాహన కార్యక్రమం
హెల్మెట్ ధరించడం పై అవగాహన కార్యక్రమం
కర్నూలు నంది పత్రిక...... కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ , కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ ఉత్తర్వుల మేరకు కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్ ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్లు , ఆర్ ఎస్ ఐ Md హుస్సేన్ మరియు ట్రాఫిక్ సిబ్బంది సోమవారం సాయంత్రము 5 .3 0 గంటల సమయంన కర్నూలు సి క్యాంప్ సెంటర్లో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం పై అవగాహన కార్యక్రమం నిర్వహించి, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వలన కలుగు లాభములు మరియు నష్టంల గురించి అవగాహన కల్పించడమైనది. ద్విచక్ర వాహనంపై వెళ్లినప్పుడు వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా కచ్చితంగా హెల్మెట్ ధరించవలెను. హెల్మెట్ ధరించడం వలన ఆక్సిడెంట్ జరిగిన సమయంలో ప్రాణాపాయం నుండి రక్షించుకోగలమని, నిర్లక్ష్యం వలన ఊహించని ప్రాణ నష్టం జరుగునని తెలుపడం అయినది. 01.03.2025 వ తేది నుండి అమలులోకి వచ్చిన సవరించిన నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారము హెల్మెట్ ధరించని ఎడల భారీ జరిమానాలు వేయవలసి ఉంటుంది.ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమమునకు స్పందించిన సుమారు 90 మంది ద్విచక్ర వాహనదారులు నూతన హెల్మెట్స్ తెచ్చుకొని ధరించుకొని వెళ్లడమైనది.
Comment List