రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి

On

IMG-20250424-WA0067

-జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్

నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 24 . (నంది పత్రిక ):రహదారి ప్రమాదాల నివారణ కోసం సత్వర చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జాయింట్ కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నంద్యాల ఎఎస్పీ మంద జవాలి అల్ఫోన్స్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు డిఎస్పీ రామాంజనేయులు, ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్, నంద్యాల మున్సిపల్ కమీషనర్ నిరంజన్ రెడ్డి, ఎన్హెచ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణ కోసం సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత జిల్లా రహదారి భద్రతా సమావేశంలోనే నంద్యాల జిల్లా నేషనల్ హైవే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ లో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించినప్పటికీ ఇంకా పూర్తి చేయలేదని... వాటిని త్వరితగతిన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమీషనర్ ను జెసి ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖ ఏర్పాటు చేయాల్సిన స్పీడ్ బ్రేకర్స్, మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ వెలుగుల ఏర్పాటు పనులు, నేషనల్ హైవే పరిధిలో అవసరమై గుర్తించిన ప్రదేశాల్లో బ్యార్కేడ్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఎన్హెచ్ 40 చాబోలు సమీపంలో ప్రమాదాల నివారణ కోసం బ్యార్కేడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే శాంతిరాం ఆసుపత్రి దగ్గర కూడా బ్యార్కేడ్స్ తో పాటు ఇల్యూమినేషన్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. రైతునగరం రోడ్డు వైపు ఉన్న పాట్ హోల్స్ అన్నిటిని క్లియర్ చేసామని ఆర్ అండ్ బీ ఎస్ఈ జాయింట్ కలెక్టర్ కు వివరించారు. అహోబిలం బైపాస్ రోడ్డు నుండి నంద్యాలకు వచ్చే వాహదారులు ఆపోజిట్ దారిలో రావడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం వుందని వాటి నివారణ కోసం సి-కర్వ్ బ్లాక్స్ ఏర్పాటు చేయాలని, చిన్నకందుకూరు రోడ్డు దగ్గర కూడా సర్వీసు రోడ్డులో వెళ్లకుండా ఆపోజిట్ దారిలో వెళ్తున్నారని, అదే విధంగా చాగలమర్రి గ్రామం మద్దూరుమెట్ట దగ్గర కూడా వాహనదారులు సర్వీసు రోడ్డులో వెళ్లకుండా ఆపోజిట్ రావడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆళ్లగడ్డ డిఎస్పీ వివరించగా క్షేత్ర స్థాయి పరిశీలించి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా కుల్లూరు రాస్తా దగ్గర ఒక్కవైపు మాత్రమే స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారని ఇంకొక వైపు కూడా స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, ఆల్ఫా కాలేజ్ దగ్గర ఆర్టీసీ బస్సులు సూచించిన ప్రదేశంలో నిలబడేలా చూడాలని ఆళ్లగడ్డ డిఎస్పీ జాయింట్ కలెక్టర్ ను కోరారు. జిల్లాలో మొత్తం 23 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని అందులో 11 పూర్తి కాగా, ఇంకా 12 పెండింగ్ ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డోన్ మండలం ఉంగరాలగుండ్ల దారిలో రైలింగ్ పెండింగ్ ఉందని అందువల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్హెచ్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చేలా ఐరాడ్ తో సమన్వయం చేసుకోవాలన్నారు. డోన్ ఎన్హెచ్ 40 ప్రాంతంలో ప్రమాదాల నివారణ కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కోరారు. హిట్ అండ్ రన్ కేసుల వివరాలను ఎప్పటికపుడు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వందేమార్ట్ పార్కింగ్ స్థలంలో ఇతర వస్తువులు ఉంచడం వల్ల పార్కింగ్ కు ఇబ్బంది అవుతుందని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని, నూనెపల్లె జంక్షన్ నుండి అయ్యలూరు మిట్ట వరకు మెరుగైన విద్యుత్ సరఫరా లేవని వాటిని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నంద్యాల మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. ఆర్ అండ్ బీ రోడ్ల మీద మార్కింగ్స్ వేయాలని, కొన్ని ప్రాంతాల్లో డస్ట్ బిన్స్ రోడ్డు మీద పెడుతున్నారని వాటికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నగరంలోకి హెవీ లోడ్ వాహనలు ఏ సమయంలో రావాలి అనే బోర్డులు ఏర్పాటు చేయాలని, అదే విధంగా తర్థూరు, నాగలూటి ప్రాంతంలో అప్రోచ్ రోడ్డుకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని పోలీసు వారు కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 
మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  
శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత
రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి