పదవ తరగతి పరీక్ష విద్యార్థులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
బైర్లూటి ప్రభుత్వ గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ నిర్వాకం.
15. కిలోమీటర్ల దూరంలోని ఆత్మకూరు పరీక్షా కేంద్రాలకు బాలికలను డొక్కు ఆటోలలో తరలించిన ప్రిన్సిపల్.
సిద్దాపురం చెరువు సమీపంలో విద్యార్థుల ఆటో అదుపుతప్పి న ఆటో.
క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం.
ఆటో లారీని ఢీ కొట్టి ఉంటే .. 15 మందికి పైగా విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందేవారు.
నంద్యాల జిల్లా కలెక్టర్, డీఈవో అధికారులు మా పిల్లలను కాపాడమని మొరపెట్టుకుంటున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు.
ఆత్మకూరు మార్చి 17 నంది పత్రిక,
నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పది మండలల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలను చేరుకోవాలని హడావుడిగా పరుగులు తీశారు.అయితే ఆత్మకూరు కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంచు గిరిజనుల కోసం ఏర్పాటుచేసిన గిరిజన ఆశ్రమ పాఠశాలలోని బాలికలు పదవ తరగతి పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం ఏడున్నర గంటలు దాటిన ఆ పాఠశాల ప్రిన్సిపల్ హాల్ టికెట్లు ఇవ్వకపోగా నంద్యాల నుంచి ఏడున్నర గంటలకు బైర్లూటి హాస్టల్ చేరుకుంది. 34 మందికి పైగా బాలికలు 15 కిలోమీటర్ల దూరంలోని ఆత్మకూరులోని ఏడు కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఉదయం ఎనిమిది గంటలకు ఆయా కేంద్రాల్లో ఉండాల్సి ఉండగా బాలికలను పరిమితికి మించి డొక్కు ఆటోలలో ఆత్మకూరుకుపశువులు, గొర్రెలను సంతకు తరలించినట్లు చేర్చింది. దీన్ని గమనించిన చెంచు గిరిజనుల బాలికల తల్లిదండ్రులు తమ పిల్లలను బైకులపై ఆత్మకూరు పరీక్ష కేంద్రాలకుతీసుకువెళ్లారు. బైర్లూటి గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ ప్రవర్తించిన తిరుపట్ల విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో తమ ప్రాణాల పోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. బైర్లూటి మహిళ ప్రిన్సిపాల్ పదవ తరగతి పరీక్షలు రాసే బాలికల పట్ల ప్రవర్తించిన తీరుపై నంద్యాల జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారుల కు బైర్లూటి చెంచు గిరిజనలు ఫిర్యాదు చేశారు.
Comment List