యూరియా అధిక ధరను అరికట్టి.
రైతులకు సకాలంలో అందించాలి.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఎండి అంజాద్ పాషా.
మలుగు జిల్లా బ్యూరో : ఫిబ్రవరి 3( నంది పత్రిక)
ములుగు జిల్లాలో యూరియా అధిక ధరను అరికట్టి. సకాలంలో వరి పంట ఇతర రైతులకు వెంటనే అందించాలని. ములుగు జిల్లా వ్యవసాయ అధికారికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజాద్ పాషా పాల్గొని మాట్లాడుతూ ములుగు జిల్లాలో అధిక వర్షాల వలన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ సుమారు 40 వేల ఎకరాలలో వరి సాగు అయిందని. మొక్కజొన్న ఇతర పంటలు వేయడం మూలంగా యూరియా అవసరం రైతాంగానికి ఎక్కువ అయిందని. రైతాంగం బలహీనత ఆసరా చేసుకొని ఎక్కువ ధరకు సుమారు 300 నుండి 350 వరకు యూరియా వస్తాకు అమ్ముతున్నారని అన్నారు. కావున ములుగు జిల్లా రైతాంగను యూరియా సరఫరా చేసి రైతాంగమునకు సకాలంలో యాసంగి రైతులకు ప్రభుత్వ ధరకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ముత్యాల రాజు రైతు సంఘం నాయకులు. మోడం రాజమౌళి పోతిరెడ్డి సాంబయ్య మామిడి నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List