మహిళలు మరియు చిన్నారుల రక్షణ, వారి భద్రతే మా ప్రధాన ధ్యేయం
నంద్యాల క్రైమ్. మార్చి 01 . (నంది పత్రిక ):మార్చి 8 వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూల్ రేంజ్ డిఐజి కోయ.ప్రవీణ్ ,నంద్యాల జిల్లా ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలమేరకు అంతర్జాతీయ మహిళా దిన వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.దీనిలో భాగంగా మెడికల్ క్యాంపు, ఓపెన్ హౌస్ ను సందర్శించిన మహిళలు, విద్యార్థినిలకు పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్ లో జరుగు విధులు, మహిళా సహాయ కేంద్రం పట్ల అవగాహన, పోలీసులు పనితీరు, వాడే పరికరాలు, పలు రికార్డుల నిర్వహణ తదితర విషయాలపై వివరించారు.నంద్యాల సబ్ డివిజన్ అడిషనల్ ఎస్పీ మంద జావళి , జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మరియు ఐ సి డి ఎస్ ఇతర శాఖల వారు కలిసి మహిళల భద్రత ,హక్కులు సాధికారతపై అవగాహన ర్యాలీ చేపట్టారు.మహిళా చట్టాలు, ఫోక్సో యాక్ట్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సామాజిక మాధ్యమాలు మరియు సైబర్ క్రైమ్స్ పై తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.బాలికలు తప్పనిసరిగా స్వీయ రక్షణ కలిగి ఉండాలని, ఎదుటివారి నుండి తమను తాము రక్షించుకోవడం నేర్చుకోవాలని తెలిపారు.స్వీయ రక్షణ నైపుణ్యాలు, దృఢంగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని, అదేవిధంగా సైబర్ భద్రత నియమాలు గురించి ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో ఉన్నామని,స్మార్ట్ మొబైల్స్ ఎక్కువగా వాడవద్దని, మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన సైబర్ క్రైమ్ లాంటి నేరాలు, జరగడానికి అవకాశం ఉందని, అనాథరైస్డ్ యాప్స్ మరియు మొబైల్స్ లో వచ్చే లింకులు సెలెక్ట్ చేయవద్దని తెలిపారు.బాలికలందరూ మంచిగా చదువుకొని సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడాలని తెలిపారు.పోలీస్ శాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎల్లవేళలా పోలీస్ సిబ్బంది సహాయం,సహకారాలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలియజేశారు.మహిళలు/చిన్నారులకు అత్యవసర సమయంలో సహాయం కొరకు హెల్ప్‌లైన్ నెంబర్లు చైల్డ్ హెల్ప్ లైన్:1098, ఉమెన్ హెల్ప్ లైన్:181,పోలీస్ హెల్ప్ లైన్:100 / 112, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్:1930 , నంద్యాల పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ *9154878120* మరియు ల్యాండ్ నెంబరు *08514 225097* నెంబర్లకు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలియజేశారు.
Comment List