శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ ప్రమాణాల ఇంటర్న్షిప్‌లు, ఉద్యోగ అవకాశాలు 

On

IMG_20250210_232927

నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 10 . (నంది పత్రిక ):శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాల, నంద్యాల మరియు ఎమ్‌కోర్ టెక్నాలజీ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు మధ్య పారిశ్రామిక సహకార ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా కళాశాల విద్యార్థులు మరియు బోధన సిబ్బందికి పరిశ్రమ నిపుణుల ఉపన్యాసాలు, ఆధునిక వర్క్‌షాప్‌లు, అంతర్జాతీయ ప్రమాణాల ఇంటర్న్షిప్‌లు, అలాగే ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.ఈ ఒప్పందానికి కళాశాల తరఫున ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రమణ్యం అధికారికంగా సంతకం చేశారు. ఎమ్‌కోర్ టెక్నాలజీ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సాయి శ్రీనివాస్ కళాశాలను సందర్శించి నిపుణుల నియామక ప్రక్రియను నిర్వహించడంతో పాటు, ఎమ్ఓయూ పై సంతకం చేశారు.ఈ ఒప్పందం 5 సంవత్సరాల పాటు అమలులో ఉండనున్నది. విద్యార్థులు ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో అత్యాధునిక పరిశ్రమ అనుభవాన్ని పొందే అవకాశాన్ని ఇది కల్పించనుంది.శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాల పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, విద్యార్థులకు ప్రపంచస్థాయి అవకాశాలను అందించేందుకు అంకితభావంతో ముందుకు సాగుతోంది. ఈ ఒప్పందం, కళాశాల విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి మరొక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశిస్తున్నాము.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News