శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చొరవతో
మహానందీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మొట్టమొదటిసారిగా సీఎంకు ఆహ్వానం...
మహానంది క్షేత్రం మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి సహకరించండి ఎమ్మెల్యే బుడ్డా వినతి
మహానంది ఫిబ్రవరి 17 (నంది పత్రిక):-
మహానంది పుణ్యక్షేత్రంలో జరిగే మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,మహానంది దేవస్థానం ఈవో ఎన్.శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు.ముందుగా వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఆలయ వేదపండితులు,అర్చకులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి,జ్ఞాపిక,ప్రసాదాలను అందజేశారు.మహానంది క్షేత్రంలో ఈనెల 24 వతేదీ నుంచి మార్చి 1 వతేదీ వరకు జరిగే మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చొరవతో
మహానందీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మొట్టమొదటిసారిగా సీఎంకు ఆహ్వానం పలికారు.మహానంది క్షేత్రం విశిష్టత,వివిధ అంశాలను
సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు ఈవో వివరించారు.అనంతరం ఎమ్మెల్యే, ఈవో,వేద పండితులతో సీఎం మాట్లాడుతూ..మహానంది క్షేత్ర చరిత్ర,నేటి వరకు మహానందిలో జరిగిన అభివృద్ధి,భవిష్యత్తులో జరగాల్సినటువంటి అభివృద్ధి,బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.అనంతరం మహానంది ఆలయం మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి కృషి చేయాలని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించారని ఈవో తెలిపారు.
Comment List