శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
On
శ్రీశైలం. ఫిబ్రవరి 24 . (నంది పత్రిక ):
మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజైన సోమవారం స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయి.తరువాత యాగశాలయందు శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేయబడ్డాయి.
అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి.
అదే విధముగా ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపించబడుతాయి.
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Mar 2025 22:47:09
-ఎస్సీ, బీసీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పివిటీజీలకు లక్ష రూపాయలు అదనపు ఆర్థిక లబ్ధి
-జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి. మార్చి...
Comment List