విద్యా,వైద్య మరియు ఆరోగ్య శాఖ క్షేత్ర స్థాయి అధికారులకు  ఒక రోజు శిక్షణ కార్యక్రమము

On

IMG_20250303_211029

కర్నూలు నంది పత్రిక........
సోమవారంకర్నూలు మెడికల్ కాలేజీ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో ఆర్‌బి‌ఎస్‌కే,ఆర్‌కే‌ఎస్‌కే సమన్వయకర్త డాక్టర్,శైలేశ్ కుమార్  అధ్వర్యంలో  చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై ఐసి5‌డి‌ఎస్,విద్యా,వైద్య మరియు ఆరోగ్య శాఖ క్షేత్ర స్థాయి అధికారులకు  ఒక రోజు శిక్షణ కార్యక్రమము నిర్వహించినారు, జిల్లావైద్య మరియుఆరోగ్యశాఖాధికారి పి.శాంతిక ల ఈ కార్యక్రమములోముఖ్య అతిథిగా పాల్గొన్నారు, అనంతరం మాట్లాడుతూ బాలికపై జరిగే అఘాయిత్యలను అరికట్టలంటే పాఠశాల స్టాయీ నుంచే  మంచి స్పర్శ,చెడు స్పర్శపై బాలికలకు  తల్లితండ్రులు అవగాహన  కల్పించాలని,ఎదుటి వారు బాలికలతో మాట్లాడుతూ శరీరంలో ఏ ఏ భాగాలను తాకుతూ మాట్లాడుతున్నారో క్షుణ్ణంగా గమనించినప్పుడు వారు మంచి వారో ,చెడువారో తప్పక తెలుసుకోవచ్చునని అన్నారు,ఈ విషయాన్ని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు   దృష్టికి తీసుకొని వెళ్లాలని తెలిపారు. 18 సమత్సరములలోపు బాలికలను లైంగికంగా వేధించినా, చిన్నారులపై అత్యాచారంతోపాటు మైనర్లపై దాడులకు పాల్పడేవారిపై మరియు 16 సంవత్సరములలోపు చిన్నారులపై (బాలికైనా-బాలుడైనా)లైంగిక దాడికి పాల్పడినా,అపహరించినా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారని,బాల్య వివాహాలు,అఘాయిత్యలపై భాదితులు,గుర్తించిన వారు ఫిర్యాదు చేసేందుకు  ప్రభుత్వం  చైల్డ్ లైన్ -1098 , 100,181  ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇస్తే అధికారులు సత్వరం స్పందించి పిల్లలకు రక్షణ కల్పిస్తారని తెలిపారు.
.    మానసిక వైద్య  నిపుణులు (జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమము)డాక్టర్,చైతన్య  మాట్లాడుతూ  పిల్లలు లైంగిక దాడులకు గురి అయినప్పుడు వారి ఎదుగుదలపై మానసిక,శరీరకంగా చెడు ప్రభావము చూపుతుందని తెలిపారు. వారిలో ఆందోళన,భయం ,మానసిక స్థితిలో మార్పులు, చెడు కలలు, ఏకాగ్రత పెట్టకపోవడము,లాంటి సమస్యలు ఉంటాయని వారిని గుర్తించి ఏలా కౌన్సెలింగ్ చేయాలో వివరించినారు.
ఈ సందర్భంగా డాక్టర్.శైలేశ్ కుమార్  మాట్లాడుతూపుట్టిన శిశువు నుంచి 18 సంవత్సరములలోపు బాల బాలికలకు రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం ద్వారా  పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించదము,విటమిన్ ల వలన లోపం వచ్చే వ్యాధుల గుర్తింపు,పిల్లల్లో పెరిగే దశలో వచ్చే వ్యాధులను గుర్తించడం,పిల్లల్లో అవయవాల పెరుగుదల లోపించడ వంటి వ్యాధులను గుర్తించి వైద్య ము అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమములో DPMO డాక్టర్.ఉమా ,డైస్ మేనేజర్ ఇర్ఫాన్ ,ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ ,ఆర్‌కే‌ఎస్‌కే కన్సల్టెంట్ మల్లికార్జున ,డైస్ సిబ్బంది మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News