శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నంద్యాల జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ IPS
*భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు.*
*పటిష్ట భద్రత భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశం.*
శ్రీశైలం ఫిబ్రవరి 19 (నంది పత్రిక )నంద్యాల జిల్లా శ్రీశైలంలో నేటి నుంచి 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా ఏర్పాటుచేసిన భద్రతా చర్యలను నంద్యాల ఇన్చార్జి ఎస్పి శ్రీ విక్రాంత్ పాటిల్ IPS పరిశీలించారు.
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీశైలం దేవస్థానం లోని క్యూలైన్ లు, గుడి పరిసరాలు, లడ్డు కౌంటర్ శివ స్వాముల క్యూ లైన్, స్నాన ఘట్టాలు, శ్రీకృష్ణదేవరాయల గోపుర పరిసర ప్రాంతాలు ,రథ మండపం, కమాండ్ కంట్రోల్ ,శ్రీశైల డ్యామ్ సమీపంలోని ఘాట్ రోడ్డు మొదలగు ప్రాంతాలలో పర్యటించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్పీ మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్పీ తో పాటు నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పి అడ్మిన్ N. యుగంధర్ బాబు , ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ , ఇన్స్పెక్టర్లు మోహన్ రెడ్డి, ప్రసాదరావు, చంద్రబాబు, సురేష్ కుమార్ రెడ్డి మరియు దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళి పాల్గొన్నారు.
Comment List