మహిళా వృద్ధి దేశాభివృద్ధి..
నంద్యాల ప్రతినిధి. మార్చి 08 . (నంది పత్రిక ):నంద్యాలలోని న్యూక్లియస్ కళాశాలలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.
కళాశాల డైరెక్టర్లు మురళీధర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య వక్తగా రచయిత కొప్పుల ప్రసాద్ పాల్గొని నేడు "మహిళా వృద్ధి దేశాభివృద్ధి" అని నేడు మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నప్పటికీ సమాజంలో వివక్షత ఇంకా ఎదుర్కొంటున్నారని వారిపై అత్యాచారాలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయని చెప్పారు . డైరెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీ సహనంలో భూదేవితో సమానమని ఏ రంగం విజయం సాధించాలన్నా
మహిళల చేతుల్లోనే ఉందని కొనియాడారు. వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాలలో ఎదగాలని వారి శ్రమకు విలువ కట్టలేం చెప్పారు.అనంతరం కళాశాలలో సీనియర్ అధ్యాపకురాలు ప్రియాంకను సన్మానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు, పాల్గొనడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది.
Comment List