తాగునీటి సమస్యలకు ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకోవాలి 

On

IMG_20250315_222429

-తాగునీటి ఎద్దడి లేకుండా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారన్న మంత్రి

-జలజీవన్ మిషన్ పథకం అమలులో గత ప్రభుత్వం అలసత్వం

-నీటి ఎద్దడిపై అధికారులు త్వరితగతిన స్పందించండి

నంద్యాల ప్రతినిధి. మార్చి 15. (నంది పత్రిక ):వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో వేసవి తీవ్రత దృష్ట్యా రూరల్, అర్బన్ ప్రాంతాల్లో సరఫరా చేయాల్సిన త్రాగునీటి సరఫరాపై ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితరెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, డిఆర్ఓ రామునాయక్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి ఎద్దడిని నివారించడానికి, నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడటానికి ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవి కారణంగా ప్రస్తుతం భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న క్రమంలో వచ్చే వర్షాకాలం సీజన్ వరకు ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగిందన్నారు. తాగునీటి ఎద్దడిపై స్థానికంగా గ్రామాలలో ఉన్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యేలకు దృష్టికి తీసుకు రావడం జరిగిందన్నారు.తాగునీటి సమస్యలకు ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకోవాలి*

రేపు రాబోయే కాలంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా అధికారులు చూడాలన్నారు. వేసవిలో ఒక్కోసారి సడన్ గా భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని, అందుకు ముందుగానే ప్రత్యామ్నయం చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుదన్నారు. అలా ముందస్తుగా ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక రెండు రోజుల్లో పరిష్కరించవచ్చన్నారు. నీటి ఎద్దడి వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఉద్యోగుల అశ్రద్ధ అలసత్వం వహిస్తే, ప్రజలు ఇబ్బంది పడితే అంతిమంగా అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం అవుతుందన్నారు.తాగునీటి ఎద్దడి లేకుండా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి భరోసా*

తాగునీటికి సంబంధించి ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, నిధుల విషయం ఆలోచించవద్దని ఈ విషయంలో ముఖ్యమంత్రి సైతం భరోసా ఇచ్చారన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై కలెక్టర్, శాసనసభ్యులు దృష్టికి తీసుకువస్తే తగిన నిధులు కేటాయించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

జలజీవన్ మిషన్ పథకం అమలులో గత ప్రభుత్వం అలసత్వం* 

గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ పథకంలో చూపిన అశ్రద్ధ వల్ల నేడు చాలా గ్రామాల్లో వాటర్ ట్యాంకులు కడితే పైప్ లైన్లు లేని పరిస్థితి.. పైప్ లైన్లు నిర్మించిన చోట వాటర్ ట్యాంకులు కట్టని పరిస్థితి.. కొన్ని చోట్ల అయితే కనీసం నీటి వనరులు కూడా లేకుండా నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి నెలకొందన్నారు.

నీటి ఎద్దడి పై అధికారులు త్వరితగతిన స్పందించాలి*

ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వ నిధులు వృధా కాకూడదన్నారు. గ్రామాలలో స్థానికంగా ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎమ్మెల్యేలు నివేదిక అందిస్తే అందుకు అనుగుణంగా అవసరమైన చోట్ల నిధులు కేటాయించి ఆయా సమస్యలను పరిష్కరిద్దామన్నారు. జిల్లాలో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దడి ఉందని మీడియాలో రావడం కంటే ముందే అధికారులు స్పందించాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను క్షేత్రస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ దృష్టికి తీసుకువస్తే తక్షణమే స్పందించి ఆయా సమస్యలను పరిష్కరిద్దామన్నారు.జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ 489 గ్రామపంచాయతీలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రతి రిజర్వాయర్లో నిల్వలో ఉన్న నీటి లభ్యతను బట్టి పబ్లిక్ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారులతో ప్రణాళిక సిద్దం చేసుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపుకోవాలన్నారు. 2.5 లక్షల ఎకరాలకు రైతులకు సాగునీటిని అందించే క్రమంలో నీటి కొరత లేకుండా వారబంధి పద్ధతిలో నీతిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో దాదాపు 25 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఇంకిపోయాయని నీటి వనరులను అన్వేషించి తాత్కాలిక నీటి సరఫరాపై ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. త్రాగునీటి సరఫరాకు సంబంధించి నంద్యాల జిల్లాకు రావలసిన జిల్లా పరిషత్ నిధులను కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తే అత్యవసర గ్రామాల్లో నీటి సరఫరాకు వినియోగించే అవకాశం ఉంటుందన్నారు.జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా తీవ్రమైన నీటి ఎద్దడి ఉంటే అందుకు తగ్గ ప్రతిపాదనలు సంబంధిత ఇంజనీర్ల నుండి ప్రతిపాదనలు వచ్చినట్లయితే జిల్లా పరిషత్ నిధుల నుంచి నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ డోన్ ప్రాంతంలో అధిక శాతం వర్షాధార మీద ఆధారపడి ఉంటుందని....వీటిని దృష్టిలో ఉంచుకొని ప్యాపిలి మండంలో బోర్ వెల్స్ కూడా వేయడం జరిగిందన్నారు. వేసవి దృష్ట్యా ఏ మండలాల్లో కూడా త్రాగు నీటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎన్హెచ్ 340బి రహదారి వేయడం వల్ల పైప్ లైన్ కూడా డ్యామేజ్ అయ్యిందని వెంటనే వాటిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితరెడ్డి మాట్లాడుతూ సుగాలిమెట్ట మోడల్ స్కూల్ లో త్రాగునీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉందని వాటిని పరిష్కరించాలన్నారు. తోగరుచేడులో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు పడిపోయే స్థితిలో ఉందని దానిని పునరుద్ధరించాలని కోరారు. అదే విధంగా తమ్మరాజుపల్లె, నెరవాడ, ఉండుట్ల, ఎల్.కె. తాండా గ్రామాల్లో త్రాగు నీటి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. పాణ్యం మండలం ఉర్దూ పాఠశాలలో నీటి సమస్య ఉందని, అదే విధంగా గడివేముల మండలంలో పెసరవాయి, చింతనూరు నీటి లభ్యత ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా బూజునూరు గ్రామంలో పైప్ లైన్ డ్యామేజ్ అయ్యిందని వెంటనే వాటిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ట్యాంకుల్లో వంద శాతం నీరు నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత నందికొట్కూరు మున్సిపాలిటీకి సుమారుగా 30 లక్షల రూపాయలకు త్రాగు నీటి కోసం ఇవ్వడం జరిగిందన్నారు. ఎర్రగూడూరు మండల పరిధిలో త్రాగునీరు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

జాబ్ మేళ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోవాలి జాబ్ మేళ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోవాలి
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 03 . (నంది పత్రిక ):నంద్యాల 03-04-2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభి వృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గంలోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల...
శ్రీశైలంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలకు పిఎన్టి ల్యాబ్ కు ప్రత్యేక గౌరవం
నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
ఒంగోలు జాతి పశు పోషకులు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి బ్రాండ్ అంబాజర్.. 
అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు
విద్యార్థులకు ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ చాలా ముఖ్యము