జాబ్ మేళ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోవాలి
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 03 . (నంది పత్రిక ):నంద్యాల 03-04-2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభి వృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణము నందు 2025 ఏప్రిల్ 10న జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి పి.సోమ శివారెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి. శ్రీకాంత్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ శశికళ, కోఆర్డినేటర్ పార్వతి, మరియు ప్లేస్మెంట్ అధికారి కె.సుబ్బన్న పాల్గొన్నారు.ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీలు ఔరోబిందో ఫార్మసీ , గ్రీటెచ్ ఇండస్ట్రీస్ , రేస్ డైరెక్ట్ సర్వీసెస్, నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్, అపోలో ఫార్మసీ, అమెజాన్ , తదితర కంపెనీలకు చెందిన హెచ్ ఆర్ ప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనుటకు పదవ తరగతి, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బి టెక్
మెకానికల్ ) ,మరియు పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. కావున జిల్లా లోని నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకో గలరని తెలియ జేశారు. వీటికి సంబంధించిన ఇతర వివరముల కొరకు 8297812530,9182217075 నెంబర్లకు లేదా naipunyam.ap.gov.in సంప్రదించాలని తెలియజేశారు.అనంతరం జాబ్ మేళకు సంబంధించిన జిల్లా కలెక్టర్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
Comment List