శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సైనిక సంక్షేమ శాఖకు విరాళం
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 04 . (నంది పత్రిక ): నంద్యాల శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సైనిక సంక్షేమ శాఖకు విరాళం అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. సుబ్రమణ్యం తెలిపారు.భారత సైనికుల సంక్షేమం మరియు వారి కుటుంబాలకు వివిధ సేవలు, సౌకర్యాలు, మరియు సహాయక కార్యక్రమాలను అందించడానికి విరాళాలు సేకరించినట్లు తెలిపారు. అంత మాత్రమే కాకుండా విరామ సైనిక ఉద్యోగులు, వారి విధవరండ్రాయిన భార్యలు మరియు వారిపై ఆధారపడుచున్నటువంటి వారి అభివృద్ధికై చేయూతనిస్తున్నట్లు తెలియజేశారు. సైనిక సంక్షేమం ద్వారా, సైనికులు మరియు వారి కుటుంబాలకు అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కళాశాల యజమాన్యం మరియు విద్యార్థులు ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వెల్ఫేర్ కమిటీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి నాగరాజు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.
Comment List