కేసి కాలువకు నిలిచిపోయిన సాగునీరు - ఆందోళనలో రైతన్నలు
....సుమారు 25 వేల ఎకరాల్లో వరి, మిరపపంటలు ప్రశ్నార్థకం
....కనీసం 20 రోజులు నీరందిస్తే.. పంట చేతికి వచ్చే అవకాశం
....రైతన్నల సమస్యలను మంత్రులు ఫరూక్, బిసి, నిమ్మల దృష్టికి తీసుకోవెళ్ళిన ఏపి మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి.
నంద్యాల ప్రతినిధి. మార్చి 04 . (నంది పత్రిక ): నంద్యాల జిల్లాలో రబీ పంటలు సాగుచేస్తున్న రైతన్నలు జలవనరుల శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ముందస్తు సమాచారం లేకుండా కేసి కాలువకు సాగునీటిని అధికారులునిలిపివేశారు. దీంతో కేసి కాలువ కింద వరి, మిరప, తదితర పంటలు సాగుచేసే రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. దీంతో, నంద్యాల జిల్లా రైతన్నలు కేసి కాలువకు సాగునీరు నిలిపివేసిన విషయాన్ని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఏపి మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి దృష్టికి తీసుకోవచ్చారు. నంద్యాల జిల్లాలోని కేసి కాలువ పరిధిలో ప్రస్తుతం రబీ సీజన్లో రైతన్నలు సుమారు 25 వేల ఎకరాల్లో వరి, మిరప., పంటలతో పాటు, ఆరుతడి పంటలను సాగుచేసున్నారు.నంద్యాల జిల్లాలో రైతన్నలు వరి పంటలు భారి ఎత్తున సాగుచేస్తున్న విషయం జలవనరుల శాఖ అధికారులకు తెలుసు, అయినా... వరిపంట పొట్టకు వచ్చేదశలో సాగునీరు నిలిపివేయడంతో రైతులు భారి ఎత్తున నష్టపోయే అవకశం ఉంది. రైతన్నల సమస్యలను తెలుసుకున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఏపి మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి మంగళవారం జలవనరుల శాఖ అధికారులతో ఫోన్ చేసి సాగునీరు విడుదల గురించి చర్చించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదలను ఆపివేసినట్టు చెప్పారు. తెలంగాణా అభ్యంతరాలతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వార నీటి సరఫరా పూర్తిగా ఆపివేసినట్టు అధికారులు తులసి రెడ్డికి వివరించారు.జలవనరుల శాఖ అధికారులు కేసి కాలువకు సాగునీరు ఇవ్వడంలో చేతులు ఎత్తేయ్యడంతో... అధికారుల తీరుపై తాతిరెడ్డి తులసి రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కేసి కాలువకు సాగునీరు, రైతన్నల సమస్యలను టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఏపి మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు ఫరూక్, ఎమ్యెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, ఎంపి బైరెడ్డి శబరీ దృష్టికి తీసుకొనివెల్లారు. నంద్యాల జిల్లాలోని బండిఆత్మకూరు, నంద్యాల గోస్పాడు, సిరివెళ్ల, గోస్పాడు, ఆళ్లగడ్డ, దొర్నిపాడు తదితర మండలాల్లో ప్రస్తుత రబీ సీజన్లో సుమారు 25 ఎకరాల్లో వరి, మిరప పంటలు సాగుచేస్తున్నారని తులసిరెడ్డి మంత్రులు, ఎంఎల్యేల దృష్టికి తీసుకొనివేల్లారు.ఆకస్మికంగా కేసికాలువకు సాగునీటి నిలిపివేయ్యడంతో వేలాది ఎకరాల్లో పంట చేతికొచ్చే అవకాశం లేదని, ఫలితంగా రైతన్నలు ఆర్థికంగా భారిగా నష్టపోయే అవకాశం ఉందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఏపి మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, మంత్రులు, నేతలకు వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేసి కాలువకు కనీసం 20 రోజులపాటు సాగునీరు విడుదలకు చర్యలు తీసుకోవాలని, జలవనరుల శాఖ అధికారులకు ఆదేశాలు జారి చెయ్యలని తులసి రెడ్డి మంత్రులను కోరారు. కేవలం నంద్యాల ప్రాంత రైతన్నలు కేసి కాలువ పైనే ఆధారపడి పంటలు సాగుచేస్తున్న విషయం, కేసి కాలువకు సాగునీరు విడుదల విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఏపి మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఎమ్యెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిల ప్రియకు తాతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Comment List