రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎఐకేఎంఎస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి పత్రం అందజేత.
కేసముద్రం, మార్చి 03(నంది పత్రిక): అఖిల భారత రైతు కూలీ సంఘం కేసముద్రం మండల కార్యవర్గం ఆధ్వర్యంలో సోమవారం రైతులకు బోనస్ తో పాటు ఇతర సమస్యలు పరిష్కరించారని కోరుతూ సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసి తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బండారు ఐలయ్య, జిల్లా కార్యదర్శి గుజ్జు దేవేందర్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం క్వింటాలు రూ.500 చొప్పున బోనస్ లు చెల్లిస్తామని చెప్పి కొద్ది మంది రైతులకే ఇచ్చారు. సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని దొడ్డు వడ్లకు ఇవ్వమని చెప్పడమంటే రైతులను మోసం చేసినట్లేనన్నారు. ఇప్పటికైనా అన్ని రకాల వడ్లకు బోనన్ లు వెంటనే ఇవ్వాలని, 2 నెలల క్రితం అమ్మిన రైతులకు బోనస్ లు నేటివరకు వేయకపోవడం రైతుల పట్ల పూర్తిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచి, ఎంఎస్ స్వామి నాథన్ కమీషన్ సిఫారసులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యాకయ్య, కొట్టం అంజయ్య,
బ్రహ్మాచారి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Comment List