నాటు సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
నంది పత్రిక గడివేముల
కరిమిద్దల గ్రామానికి చెందిన వ్యక్తి నుండి పది లీటర్ల నాటుసారా స్వాధీనం
చేసుకోవడంతో పాటు ఎక్సేంజ్ ఎస్సై తెలిపారు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, నంద్యాల్ శ్రీ S. రవి కుమార్ గారి ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్, నంద్యాల్ పరిధిలోని నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గడివేముల మండలం, కరిమద్దెల గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 10 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం తో పాటు సదరు వ్యక్తిని రిమాండుకు పంపించడం జరిగింది. తదుపరి గడివేముల మండలం ,తిరుపాడు గ్రామ పెద్దల ఆద్వర్యంలో గ్రామ సభను నిర్వహించి నాటు సారాయి దుష్ప్రభావాలు గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం తో పాటు నవోదయం 2.0 సంబందించిన పంప్లెట్ లను గ్రామం లో ప్రజలకు పంచుతూ నాటు సరయికి దూరంగా ఉండమని అవగాహన కల్పించడం జరిగింది. నాటు సారాయి, డ్రగ్స్ కి సంబంధీచినటువంటి ఏ సమాచారము అయిన తెలుపాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 14405 కాల్ చేయవచ్చునని మరియు
ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, నంద్యాల్ – 9440902586
ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్, నంద్యాల్- 7989409125 మాకు అయిన తెలుపవచ్చునని తెలుపడమైనది.
Comment List