గుడుంబా స్థావరాలపై దాడులు చేసిన ములుగు పోలీస్
ములుగు జిల్లా బ్యూరో: ఏప్రిల్ 15 ( నంది పత్రిక )
ములుగు మండలంలోని రామ్ నగర్ తండా శివారులో గుడుంబా తయారు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ములుగు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడులు చేయడం జరిగింది ఇట్టి దాడులలో 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది, అదేవిధంగా 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని గుడుంబా తయారు చేస్తూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులు
1) అజ్మీర దశరథ్ s/o రాజు
2) లావుడియా వినోద్ కుమార్ s/o భాస్కర్
3) లౌడియా భగవాన్ సింగ్ s/o సంతోష్
4) అజ్మీర సునీల్s/o లాలు
5) పాల్తీయ తిరుపతి s/o సమ్మయ్య రామ్ నగర్ తండాకు చెందిన పై ఐదుగురు వ్యక్తులపై
కేసులు నమోదు చేయడం జరిగింది, ప్రభుత్వ నిషేధిత గుడుంబాను ఎవరైనా తయారుచేసి అమ్మినట్లయితే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అని ములుగు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ములుగు ఎస్సై వెంకటేశ్వరరావు గారితో పాటు రెండవ Si లక్ష్మారెడ్డి మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Comment List