వర్షాలకు 1000 ఎకరాల్లో వరి పంట నష్టం
మహానంది, ఏప్రిల్ 11 (నంది పత్రిక):-
మహానంది మండలంలోని తమ్మడపల్లె,బొల్లవరం గ్రామాలలో గాలి వర్షానికి పడిపోయిన వరి పొలాలను నంద్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు రాజశేఖర్ శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహానంది మండలంలో రబీ సీజన్లో 7,100 ఎకరాలలో వరి పంట సాగు చేయడం జరిగిందన్నారు.దాదాపు 4 వేల ఎకరాలకు పైగా వరి కోతలు పూర్తి అయ్యాయని తెలిపారు.1000 ఎకరాలు గాలి,వానకు వరి పంట పడిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని,పంట నష్టం అంచనా ప్రాథమిక నివేదికను ఉన్నత అధికారులకు పంపడం జరుగుతుందన్నారు.రైతులు పొలంలో ఉన్న నీటిని కాలువల ద్వారా వెంటనే తొలగించాలని,అదేవిధంగా కట్టలు కట్టుకోవాలని సూచించారు.గింజ గట్టిపడిన పంటపై మొలకలు రాకుండా, ఐదు శాతం ఉప్పు ద్రావణం పిచికారి చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.నాగేశ్వర రెడ్డి,గ్రామ వ్యవసాయ సహాయకులు మధు,రైతులు పాల్గొన్నారు.
Comment List