డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి

On

-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ

IMG_20250414_224959

నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 14 . (నంది పత్రిక ):భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా పొంది ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారితో పాటు, దళిత సంఘాల నాయకులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తి పొంది జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించాలన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్.అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉంటూ 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల్లో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అంతటి పటిష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. జిల్లా కలెక్టర్ గా తాను ఎంపికైన తర్వాత ఐఎఎస్ శిక్షణ నిమిత్తం ముస్సోరి వెళ్లన సమయంలో అక్కడ లిఖిత పూర్వ రాజ్యాంగ ప్రతిని చూసి చాలా సంతోషం వేసిందన్నారు. సదరు రాజ్యాంగంలో దేశ అభివృద్ధి, సంక్షేమానికి అణుగుణంగా ఎప్పటికపుడు సవరణలు చేసుకోవడం జరుగుతుందన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ సంఘ సంస్కర్త, రచయితతో పాటు వారు గొప్ప పండితుడన్నారు. ప్రపంచ మేధావని వారి మేధస్సుకు మెచ్చి వారికి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత భావితరాలు కూడా వారు అందించిన సంక్షేమ ఫలాలను సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నతనంలో వారు ఎదుర్కొన్న అంటరానితం, కుల వివక్షతను చదువుతో అధిగమించారని, అందుకు విద్యార్థులు కూడా విద్య వారి జీవితంలో ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందనేది తెలుసుకోవాలని... సరైన విద్య ఉంటే ఎంతటి అవరోధనైనా ఎదుర్కొని నిలబడి ఉన్నత స్థాయిలో నిలబడి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడంతో పాటు మరికొంత మందిని ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ మాసంలో వచ్చే ముగ్గురు మహనీయుల జయంతి వేడుకలను వసతి గృహాల్లోనే నిర్వహించాలని ఆదేశించడం జరిగిందని తదనుగుణంగా వారి ద్వారా విద్యార్థులు స్పూర్తి పొందాలన్నారు. ఎకనమిక్స్ లాంటి కష్టమైన సబ్జెక్టులో పిహెచ్డి పొందిన మొట్టమొదట వ్యక్తి డా.బి.ఆర్.అంబేద్కర్ అని తెలిపారు.జిల్లాలో 86 ఎస్సీ, ఎస్టీ, బిసి వసతి గృహాలు ఉన్నాయని విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం మీద నమ్మకంతో వసతి గృహంలో చేర్చడం జరిగిందని అందుకు వసతి గృహ సిబ్బంది కూడా వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలన్నారు. విద్యార్థులు కూడా కేవలం మార్కుల కోసమే కాకుండా సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని తద్వారా సబ్జెక్ట్ పై పట్టు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఫోన్స్, టాబ్స్ మాయలో పడి చదువును నిర్లక్ష్యం చేయకుండా ఖాళీ సమయాల్లో మహనీయులు వ్రాసిన పుస్తకాలను పఠనం చేయాలన్నారు. ఆడపిల్లలు చదువుతో పాటు దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో జరుగుతున్న అంశాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు ముఖ్యంగా ఆత్మరక్షణ కొరకు కరాటే, స్విమ్మింగ్ తదితర ఆటల్లో కూడా రాణించాలన్నారు. ఎక్కువ శాతం గ్రూప్ డిస్కషన్స్ లో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. అంబేద్కర్ గారు ముఖ్యంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే అంశాలను తెలుపడం జరిగిందని ఆ పదాలను మన జీవితంలో అన్వయించుకోవాలన్నారు. జిల్లాలో డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి పట్టణంలో చాలా స్థలాలను పరిశీలించడం జరిగిందని చివరికి అందరీ సమ్మతితో మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అంతకుముందు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం దళిత సంఘాల నాయకులు బాలస్వామి, బాల నాయక్, జీవన్ రాజ్, డివిఎంసి/సఫాయి కర్మచారి ఛైర్మన్ చెన్నమ్మ సభ్యులు మహేశ్వరి, లక్ష్మి, శ్రీరాములు, దామోదర నాగశేషు, లక్ష్మన్న, జాషువ, దేవదానం, భూషణ్, బెనర్జీ, విద్యార్థిని పూజిత డా.బి.ఆర్.అంబేద్కర్ దేశ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు చింతామణి, డిఎఫ్ఓ నాగమునేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, డిపిఓ జమీవుల్లా, పరిశ్రమల జిల్లా మేనేజర్ జవహర్ బాబు, కౌన్సిలర్ అనూష తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా డా.బి.ఆర్.అంబేద్కర్ నేపథ్యంతో రూపొందించిన జానపద, ఫోక్ డాన్స్ విద్యార్థినిలు ఇచిన నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఇటీవలి వెలువడిన ఇంటర్మీడియట్, వొకేషనల్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పుస్తకాలను ప్రధానం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

మంత్రుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ మంత్రుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
      ములుగు జిల్లా బ్యూరో : ఏప్రిల్ 17( నంది పత్రిక ) భూభారతి పోర్టల్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన
పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించండి
ప్లేస్‌మెంట్‌లో పెద్ద విజయం – నేషనల్ డిగ్రీ కళాశాల నుంచి 70 మంది మల్టీనేషనల్ కంపెనీలకు ఎంపిక
సంస్కరణల మధ్య ఆధునికతకి మరో అడుగు  – ఎఐఎంఎల్ ల్యాబ్ ప్రారంభం
గుడుంబా స్థావరాలపై దాడులు చేసిన ములుగు పోలీస్ 
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి
డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి