వట్టివాగులోకి ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయాలి

On

IMG_20250310_193200

రైతులను కాపాడాలని కోరుతూ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత.

కేసముద్రం, మార్చి 10(నంది పత్రిక): వట్టివాగులోకి ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయాలని కోరుతూ సోమవారం కేసముద్రం మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ దామోదర్ కి ఎంసీపీఐయు మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న, ఉప్పరపల్లి గ్రామ తాజా మాజీ ఇన్చార్జి సర్పంచ్ ఎలబోయిన సారయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి రైతుల పంటలను కాపాడడానికి తక్షణమే ఎస్సారెస్పీ జలాలను వట్టి వాగులోకి విడుదల చేయాలని కోరారు. ఒకవైపు పంటలు ఎండిపోయి, మరికొన్ని ఎండిపోయే పరిస్థితి నెలకొని ఉందని, జలాలు విడుదల చేసేవరకు అట్టి రైతులను కలుపుకొని ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు అంకిరెడ్డి వీరయ్య, కంకల దేవేందర్, నాగరబోయిన కోటయ్య, ఎండి కాసిం, జి ఉపేందర్, మండల సురేందర్, వనం సాయి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News