కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....

On

IMG-20250426-WA0076

యూ ట్యూబ్ లలో చూసి తాళం వేసిన ఇళ్ళల్లో దొంగతనం చేసే నిందితులు....

27 తులాల బంగారం ఆభరణాలు మరియు 35 తులాల వెండి ఆభరణములు నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న పోలీసులు. 

దొంగతనంకు వినియోగించిన రంపము , ఇనుప రాడ్డు, 2 మోటారు సైకిళ్ళు స్వాధీనం.

ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ లలో సమాచారం అందించాలని, LHMS యాప్ వినియోగించుకోవాలని ... 

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి..

IMG-20250426-WA0076

కర్నూలు నంది పత్రిక........

13.04.2025 తేదిన కర్నూలు మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని సాయివైభవ్ నగర్ లో నివశిస్తున్న ఆర్టిసి డిపో - 1 మేనేజర్ సర్ధార్ హుస్సేన్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో కర్నూలు పోలీసులు దొంగలను పట్టుకొని దొంగలించబడిన సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసి డిపో -1 మేనేజర్ సర్ధార్ హుస్సేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదారాబాద్ కు ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్ళిన సంధర్బం చూసుకొని షేక్షావలి (స్పైస్ డాభా లో పని చేసే యువకుడు), తనతో పాటు చట్టం తో విభేదింఛిన 5 మంది బాలురును జత చేసుకుని ఎలాగైనా దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో యూట్యూబ్ లో వీడియోలు చూసి తాళంను విరగగొట్టుటకు వీలుగా ఒక నూనె ను, ఒక రంపమును, ఇనుపరాడ్డు ను సిధ్ధం చేసుకుని 2 మోటారు సైకిళ్ళ మీద సాయి వైభవ్ నగర్ కు రాత్రి 1 గంటకు చేరుకున్నారు. చుట్టు ప్రక్కల ఎవరు గమనించడం లేదని తెలుసుకుని ప్రధాన ద్వారంలోని తాళం ను నూనె పోసి మరి శబ్ధం రాకుండా విరగొట్టి ఇంట్లో కి ప్రవేశించి 20 లక్షల విలువైన సుమారు 27 తులాల బంగారం ఆభరణాలు మరియు 35 తులాల వెండి ఆభరణములు దొంగలించి మోటార్ సైకిళ్ళ పై పారి పోయి, దొంగలించిన సోత్తులను భాగాలు వేసుకుని పంచుకున్నారు. మరుసటి దినం దొంగతనం జరిగిన విషయం తెలుసుకుని డిపో మేనేజర్ 13.04.2025 తేదిన ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీ టౌన్ పియస్ క్రైమ్ నెంబర్ 147/2025 క్రింద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఉపకరణాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూల్ సబ్ డివిజన్ పోలీసులు ఈ కేసు ను చేధించేందుకు పోలీసు బృందాలు ఏర్పడి సవాలుగా తీసుకుని కేసును త్వరితగతిన నేర పరిశోధన చేపట్టారు.పూర్తి సమాచారం మేరకు కర్నూలుకు చెందిన షేక్షావళి మరియు అతనితో పాటు 5 గురు బాలురను25.04.2025 వ తేదీన నంద్యాల చెక్ పోస్టు దగ్గర ఉన్న కేంద్రీయ విద్యాలయం దగ్గర అదుపులోకి తీసుకుని వారిని సోదా చేయగా వారి వద్ద నుండి దొంగతనం చేసిన సొత్తు ను పూర్తి గా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి దొంగతనానికి వాడిన రంపం, రాడ్డు, 2 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఇందులో వారి గురించి పరిశీలించగా ఇద్దరు బాలురు ఇంతకు ముందే 2 దొంగతనాలలో పాల్గొన్నట్టుగా తెలిసింది. ఈ విషయం పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది.పై బాలురు అందరూ పాఠశాలలకు వెళ్ళకుండా డ్రాప్ అవుట్ అయి మెకానిక్ షెడ్లలలోనూ అల్లరి , చిల్లరగా తిరుగుతూ, జల్సాలకు అలవాటు పడినట్లు గుర్తించడం జరిగింది.

పై వారిని సంబంధిత న్యాయస్ధానాల ముందు హజరు పెట్టడం జరుగుతుంది. రికవరీ చేసిన సొమ్మును డిపో మేనేజర్ కి అందజేయడం జరుగుతుంది.

ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి , బాగా ప్రతిభ కనబరిచిన కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు త్రీ టౌన్ పియస్ సిఐ శేషయ్య, కర్నూలు ఒన్ టౌన్ అడిషనల్ సిఐ నాగ శేఖర్ , హెడ్ కానిస్టేబుల్స్ చెంచన్న, సుంకన్న, రంగారావు, కానిస్టేబుల్స్ నాగరాజు, కిశోర్, నాగేశ్వరరావు, చంద్రబాబు నాయుడు, నాగరాజు, తిరుమలేష్, పరశురాముడు, వీర బాబు లకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ రివార్డులు అందజేశారు.

జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి.

ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ లలో సమాచారం అందించాలన్నారు. 

 LHMS యాప్ వినియోగించాలన్నారు. 

ఇళ్ళ చుట్టూ ముందు రోడ్డు బాగా కనపడేవిధంగా సిసి కెమెరాలు అమర్చుకునేవిధంగా చేయాలన్నారు. 

కాలనీలలో కొత్త వ్యక్తులు, అనుమానితులు సంచరిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా ఉన్నారు

.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 
మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  
శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత
రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి