ములుగు శారద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ములుగు జిల్లా బ్యూరో : ఏప్రిల్ 20( నంది పత్రిక )ములుగు జిల్లా సర్వాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో శారదా మల్టీస్పెషలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపు మరియు ఉచిత కంటి వైద్య శిబిరం ను సర్వాపూర్ గ్రామంలో నిర్వహించి గా మొత్తం 120కు పైగా మందికి పరీక్షలు చేయగా అందులో 42 మందికి గాను కంటిచూపు లోపన్ని గుర్తించి వారికీ ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్ ప్రశాంత్ నాయక్ సూచించటం జరిగింది. వైద్య శిబిరానికి వచ్చిన గ్రామస్తులతో డాక్టర్ మాట్లాడుతూ ఎండాకాలం ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఎండాకాలం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే 11 గంటల నుంచి మూడు గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఉపాధి హామీ కూలీలు వెళ్లేటప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు గానీ బాటిల్లో కలుపుకొని పని మీదకి వెళ్లాలి శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. కూలీలు 10 గంటల లోపు పని ముగించుకొని ఇండ్లలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. తప్పని పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే తెల్లని టోపీ. ధరించాలి. రేకుల షెడ్డులో ఉండే కుటుంబాలు ఆ వేడిమి కి వడదెబ్బ గురయ్యే ప్రమాదం ఉంటుంది. రేకుల పైన గడ్డి గాని కొన్ని సంచులు గాని వేసుకొని నీళ్లు చల్లాలి. దీంతో పిల్లలు ఎండాకాలము వీడేమీకి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు జాగ్రత్త తీసుకోవాలి. చర్మం బాగా పొడి పాడినప్పుడు సబ్బుతో ఎక్కువసార్లు కడుక్కోవద్దు దీనికి బదులుగా వీలైనంత సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం మంచిది. మనము ఎండ వేడిమికి తీసుకోవాల్సిన కీరదోస క్యారెట్ బీట్ రూట్ లాంటి పచ్చి కూరగాయలు తీసుకుంటే చర్మానికి మంచిది మీరు అత్యవసరమైన పనులకు వెళ్లేటప్పుడు తలకు రుమాలు తెల్లని చొక్కా వేసుకొని వెళ్లాలని ప్రజలకు డాక్టర్ పోరికా ప్రశాంత నాయక్ సూచించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న సిబ్బంది డాక్టర్ ప్రశాంత్ నాయక్ మరియు కంటి డాక్టర్ హాస్పిటల్స్ సిబ్బంది ఫార్మసిస్ట్ నవీన్ కుమార్. ల్యాబ్ టెక్నీషియన్ సోహెల్. సిస్టర్ జిఎన్ఎమ్ బి వెన్నెల పాల్గొన్నారు
Comment List