భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి
–రాయలసీమ సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి
కొత్తపల్లి– నంది పత్రిక : శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు రాష్ట్ర కొటాలో అర్హులైన వారికి శాశ్వతమైన ఉద్యోగాలను కల్పించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బోజ్జ దశరధరామిరెడ్డి , వై ఎన్ రెడ్డిలు డిమాండ్ చేశారు శనివారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు సాధన సమితి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ పట్ల నిర్లక్ష్యం.. వివక్ష.. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాయలసీమ సాగునీటి సాధన సమితి ధర్నాకు దిగింది. వెనకబడిన సీమప్రాంతాల అభివృద్ధిపై న్యాయబద్ధమైన 12 డిమాండ్ల మరో సిద్దేశ్వరం అలుగు వద్ద భారీ ఆందోళనకు సిద్ధపడింది.వెనకబడిన సీమప్రాంతాల అభివృద్ధిపై న్యాయబద్ధమైన అభివృద్ధి జరగలేదన్నారు 12 డిమాండ్ల మరో సిద్దేశ్వరం అలుగు వద్ద భారీ ఆందోళనకు సిద్ధపడింది. దశాబ్దాలుగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని సహించమని, అవసరమైతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి సిద్ధపడాల్సి వస్తుందని ప్రస్తుత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మే 31న సిద్దేశ్వరం 4 వద్ద జరిగే ధర్నాకు రాయలసీమ ప్రజలు,, ఉద్యమకారులు తరలి కావాలని సమితి పిలుపునిచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంతో వచ్చిన హక్కులను కృష్ణా జలాల వినియోగంపై 10 సంవత్సరాలుగా రాయలసీమను పాలకులు దగా చేస్తున్నారని ఇద్దరు రాయలసీమ ద్రోహులే అని రాయలసీమ తాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని పునర్ నిర్మాణానికి రాయలసీమ ప్రజల కష్టాన్ని నిధులుగా నిర్మించడానికి అతి దుర్మార్గ చర్యగా సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 1500 కోట్లతో కృష్ణా నదిపై సిద్దేశ్వరం వద్ద అలుగు నిర్మిస్తే 50 టీఎంసీల కృష్ణా జలాలు రాయలసీమ ప్రాజెక్టులకు ఏడాది పొడవునా నిల్వ ఉంటాయని ఇది కాదని మరోసారి పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పేరుతో గోదావరి జలాలను సీమకు రప్పిస్తానని మరో కొత్త వంచనకు తెర లేపుతుందని విమర్శించారు. గోదావరి జలాలను అమరావతి ప్రాంత గుంటూరు, కృష్ణ డెల్టా జిల్లాలకు తరలించుకొని వెళ్లి రాయలసీమ పేరుతో మరో మారు మోసం చేస్తున్న రాజకీయాలను సీమ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఏపీ అంటే.. అమరావతి.. పోలవరం మాత్రమే అన్న కుట్రతో రాయలసీమ అభివృద్ధిని జరగలేదన్నారు అమరావతికి పునర్నిర్మాణ శంకుస్థాపనకు పిలిపిస్తున్నారని దుయపట్టారు. లోక్ సభ, రాజ్యసభలోని రాయలసీమ ఎంపీలు నోరు మూసుకొని చీమకు గృహం చేస్తున్నారని విమర్శించారు.
ప్రతి సంవత్సరం కృష్ణానది లో వేలాది టీఎంసీల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయని సిద్ధేశ్వర వద్ద అలుగు నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఉపయోగమని తెలిసికూడా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉన్నారంటే రాయలసీమ అభివృద్ధి కాకూడదనేదే ఆయన ధర్నాలో పలువురు విమర్శించారు. మే నెల 31న జరిగే సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవం సమావేశంలో రాయలసీమ వెనకపాటి తనంపై కీలక నిర్ణయాలు తీసుకొని రాయలసీమ వ్యాప్తంగా కొత్త తరహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని సమితి ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Comment List