శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలకు పిఎన్టి ల్యాబ్ కు ప్రత్యేక గౌరవం
నంద్యాల ప్రతినిధి. మార్చి 24 . (నంది పత్రిక ):నంద్యాల: శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఆంధ్రప్రదేశ్ తిరుపతి నావవిష్కార్ హబ్ ఫౌండేషన్ ప్రేరేపితమైన పిఎన్టి ల్యాబ్ ఏర్పాటు కోసం ఎంపిక చేయబడింది. నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం, ఈ సంస్థను పిఎన్టి రంగంలో చేసిన విశేష కృషి మరియు నిపుణులైన అధ్యాపకుల అందుబాటును దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేశారు.ఈ పిఎన్టి ల్యాబ్ ప్రధానంగా అండర్‌గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోర్సు ప్రాజెక్టులను, పిఎన్టి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ నిపుణుల మార్గదర్శకత్వంలో విజయవంతంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది.నిధుల వివరాలు:*
పరికరాల కొరకు: కళాశాలకు పిఎన్టి ప్రాజెక్టుల పరికరాల కొనుగోలుకు *2,00,000* రూపాయల నిధులు ప్రత్యేకంగా కేటాయించబడినవి.ఇంటర్న్‌షిప్‌లకు: అదనంగా, ఇంటర్న్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు *2,00,000* రూపాయల నిధులు అందనున్నాయి. ఈ నిధులు కనీసం 20 ప్రాజెక్టులు చేపట్టడంపై దృష్టి సారిస్తూ మంజూరు చేయబడ్డాయి.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్‌గా డా. సౌమ్య గాలి గ్రాంట్ స్వీకరించారు.అదనంగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రమణ్యం మరియు ఈసీ శాఖాధ్యక్షులు డా. వై. మల్లికార్జున రావు వారి మద్దతు మరియు సమర్ధనను ప్రకటించారు.
Comment List