యాగంటిలో అత్యంత వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన
రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు
బనగానపల్లె ఫిబ్రవరి 26 నంది పత్రిక
సుప్రసిద్ధ శైవక్షేత్రం యాగంటిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయకాలం నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు శ్రీ ఉమామహేశ్వరస్వామి వారికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి - ఇందిరమ్మ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా హెల్త్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపు, మజ్జిగ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు, అనంతరం క్యూలైన్లు, మౌలిక వసతి సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని యాగంటికి విచ్చేసే భక్తులకు 3 రోజుల పాటు సొంత నిధులతో ఉచిత లడ్డూ ప్రసాదం, ఉచిత టోల్ గేట్ ఎంట్రీ సదుపాయం, కూలర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి దంపతులతో పాటు యాగంటి దేవస్థానం అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు.
Comment List