త్రాగునీటి సరఫరాలో నీరు కలుషితం కాలేదు
ప్రజలు ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
ఆత్మకూరు ఫిబ్రవరి 28నంది పత్రిక
ఆత్మకూరు పట్టణంలోని 5వవార్డునీలితొట్టివీధిలో కొళాయి త్రాగునీటి సరఫరాలో నీరు కలుషితం కాలేదని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో కొళాయిల ద్వారా త్రాగునీటి సరఫరా కలుషితంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూఆత్మకూరు పురపాలక సంఘంలోని 5వవార్డునీలితొట్టివీధిలో సరఫరాఅయ్యేత్రాగునీటిలో నీరు కలుషితం కాలేదన్నారు. ఆత్మకూరు పురపాలక సంఘానికి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరియు 35 బోర్ వెల్స్ ద్వారా నీరు సరఫరా అవుతోందన్నారు. ప్రజలకు ఎక్కడ నుంచి నీరు సరఫరా అవుతుందో ఆయా ప్రాంతాల్లోని ప్రతిచోట పైప్ లైన్ల ద్వారా సరఫరా అయ్యే నీటి నమూనాలను ల్యాబ్ లకు పంపించి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ల్యాబ్ టెస్టుల్లో నీరు కలుషితమైనట్లు నిరూపణ కాలేదని కలెక్టర్ తెలిపారు. కలుషిత నీరు సరఫరా కావడం లేదని ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో వైద్య సిబ్బంది 24 గంటల పాటు వుండేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వో, డిసిహెచ్ఎస్ లను కలెక్టర్ ఆదేశించారు. 19 ఆర్ఓ ప్లాంట్ ల సరఫరా అయ్యే నీటి నమూనాలు కూడా పరీక్షల నిమిత్తం కర్నూలు రీజినల్ ల్యాబ్ కు పంపించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఆత్మకూరు పురపాలక సంఘంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేసి పరిశుభ్రత మెరుగు పరచాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబును కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, ఆర్డిఓ నాగజ్యోతి, డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డిసీహెచ్ఎస్ డా. జఫరూళ్ళ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు,
Comment List