ఎస్సీ బాలుర వసతి గృహ మరమ్మత్తులకు నిధులు మంజూరు
దొర్నిపాడు ఫిబ్రవరి 17 పల్లె వెలుగు న్యూస్:-మండల కేంద్రమైన దొర్నిపాడు గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహ మరమ్మత్తుల కొరకు ప్రభుత్వం 29 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు వార్డెన్ రాముడు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని వసతులు సౌకర్యాలను కల్పించేందుకు నిధులను మంజూరు చేసిందని ఆయన తెలిపారు వసతిగృహంలో నెలకొన్న త్రాగునీరు, కరెంటు టాయిలెట్స్, ఫ్లోరింగ్ ,ప్లాస్టింగ్ సీలింగ్, పెయింటింగ్ వసతి గృహానికి ఏర్పాటుచేసిన గేటు డోర్ సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది అని ఆయనతెలిపారు సోమవారం ఎస్సీ బాలుర వసతి గృహాన్ని డి ,ఈ,వెంకట్ రెడ్డి తనిఖీ చేసి వసతి గృహంలో నెలకొన్న వసతులు సౌకర్యాలను పరిశీలించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాలుర వస్తు గృహానికి మంజూరు చేసిన నిధులను దుర్వినియోగం చేయకుండా వసతులను సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు నిధులు దుర్వినియోగం చేసిన పనులలో నాణ్యత లోపించిన చర్యలు తప్పవు అన్నారు వసతి గృహం లో పనులను నాణ్యతగా త్వరలో పూర్తి చేయాలని ఏఈ మహమ్మద్ గౌస్ గుత్తేదారులకు సూచించారుఈ కార్యక్రమంలో ఏఈ మహమ్మద్ గౌస్,కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు
Comment List