మున్సిపాలిటీ అవినీతిపై" సిట్" అధికారితో దర్యాప్తు చేయించాలి.

On

గత పాలకులు 20 ఏళ్లు దోచుకున్నారు.
•ఎం బుక్కులు కాల్చివేశారు...తీర్మానం పుస్తకాలు మాయమయ్యాయి.
•వికలాంగులను దూషిస్తూ,లంచం అడిగిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
•మున్సిపాలిటీ హస్తవాసి బాగుంది.
•హస్తవాసి లో డబ్బు పెడితే...అధికారుల హస్తవాసి నిండుతుంది.•మున్సిపాలిటీ లో అవినీతి నీ ఆధారాలతో బయటపెడతా.•ముఖ్యమంత్రి,ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళతా.

     ••మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి.••

GridArt_20250211_233429158

నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 11 . (నంది పత్రిక ):నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో గత పాలకులు చేసిన అవినీతిపై సిట్ అధికారితో దర్యాప్తు చేయాలని మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు.నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి నీ ఆయన ఛాంబర్లో కలిశారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీలో గత 20 ఏళ్లుగా జరిగిన అవినీతిని ఒక్కొక్కటి చెపుతూ ప్రశ్నల వర్షం కురిపించారు.కమిషనర్ తో మీడియా తో మాట్లాడిన విషయాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాల్టీ వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న కోలా నాగరాజు వికలాంగుడు అన్నారు.నాగరాజు నంద్యాలలో పనిచేస్తుండగా వెలుగోదుకు బదిలిచేసారని పేర్కొన్నారు.ఈ విషయం పై కోలా నాగరాజు మున్సిపల్ ఇంజనీర్ గురప్పా యాదవ్ ను కలవడంతో 20 వేలు డబ్బు ఇస్తే ఇక్కడే వుంటావని చెపుతూ కుంటినాకొడకా అని దూషించారని పేర్కొన్నారు.మరో బాధితుడు మహేశ్వర రెడ్డి నీ సైతం ఎం.ఈ. డి. ఈ నాగభూషణం రెడ్డి సైతం 20 వేలు ఇవ్వాలని డైమండ్ చేశారన్నారు.మరో బాధితురాలు సుబ్బమ్మ ఉద్యోగ విషయంతో పాటు సీనియర్ పాత్రికేయుల షరీఫ్ బందువుల డెత్ సర్టిఫికెట్ కోసం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారిని వాణి రెండు నెలలు ఆ కాగితం,,ఈ కాగితం అంటూ రెండు నెలలు తిప్పుకున్నారని,అలాగే శానిటరీ అధికారి మురళీ చావు కబురు చల్లగా చెప్పారన్నారు.నన్ అవెలబులిటీ సర్టిఫికెట్ ఇవ్వను నీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో అని పెడసరి సమాధానం ఇచ్చారని,మొదట్లోనే చెప్పకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు.నంద్యాలలో ఎందరో మున్సిపల్ అధికారుల వద్దకు వచ్చి అవమానాలు పడుతున్నారని అన్నారు.నంద్యాల మున్సిపల్ అధికారులు ప్రజలకు దుర్మార్గమైన పాలన అందిస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వం రాష్ట్ర మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవి ఇచ్చారని ఈ విషయంపై అధికారుల తో మాట్లాడితే డైరెక్టర్ అయితే ఏంటి,ఎవరైతే నా కేంటి,మా అడ్మినిస్ట్రేషన్ లో తల దూర్చి వద్దు అని ఆ అధికారి అహంకారంతో మాట్లాడారని పేర్కొన్నారు.గత పాలకులు 20 ఏళ్లుగా మున్సిపాలిటీలో రాబందువుల్లా దోచుకున్నారని ఆరోపించారు.2014 లో ఎన్నికల సమయంలో తప్పిదాలు బయటపడతాయని మున్సిపాలిటీ కి చెందిన ఎం బుక్కులు  కాల్చివేసారని అన్నారు.కౌన్సిల్ తీర్మానం పుస్తకాలు కనిపించడంలేదని మీకు తెలుసా అని కమిషనర్ ను ప్రశ్నించారు.మున్సిపాలిటీలో 2019 నుంచి 2024 వరకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సేకరించిన విధంగా 412 పనులు జరిగాయని మొత్తం 75 కోట్ల 84 లక్షలు పనులు జరిగాయని రికార్డు లో ఉందన్నారు.కొన్ని పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు.ఈ పనులకు సంభందించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు.బినామిలతో పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారని అన్నారు.అవినీతి అక్రమాల బయట పడకుండా ఎం బుక్కులు కల్చివేసి తీర్మానాల పుస్తకాలు కనిపించకుండా చేశారని అన్నారు.ఇంటి పన్నులు,ఖాళీ స్థలాల పన్నులు,కొళాయి పన్నులు వసూళ్లు ఆధారాలతో సహా ఎంత వస్తుందో చూపించారు.ప్రస్తుతం మున్సిపాలిటీ లో 630 మంది పని చేస్తున్నవారు ఏ ప్రభుత్వ హయంలో తీసుకున్నారో వివరాలు అడిగారు.ఆప్కాస్,ఏజెన్సీ,ప్రభుత్వం ద్వారా వీరిని నియమించామని కమిషనర్ సమాధానం ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటిలో పనిచేస్తున్న ప్రసాద్, శ్రీను, చెన్ రాయుడు మరి కొంత మంది పనిచేయకున్నా నేటి వరకు జీతాలు ఇస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.టౌన్ ప్లానింగ్ విభాగంలో ఒక ఎల్టీపి కి మాత్రమే ఫైల్స్ ఒకే చేస్తారని,మిగతా ఫైల్స్ చేయరనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయని పేర్కొన్నారు.హస్తవాసి బాగుంటే ,మీ హస్తవాసి బాగుంటుందని అన్న దానికి కమిషనర్ చెప్పిన పిట్ట కథకు అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.పట్టణంలో ఎందరో వైద్యులు ఉన్నా ఒక వైద్యుడు హస్తవాసి బాగుంటే ఆయన వద్దకే వెళతారని,ఆ మాదిరిగానే ఎల్ టీ పి హస్తవాసి బాగుందని ఆయన వద్దకే వెళతారేమో అన్న సమాధానానికి అందరినీ నవ్వులతో ముంచెత్తారు.టౌన్ ప్లానింగ్ లో ఏడాదికి 150 ఫైల్స్ వస్తాయని ఎల్ టీ పి లు దాదాపు 40 మందిలో బెటర్ వ్యక్తిని ఎన్నుకొని ఫైల్స్ ఇస్తారని ఆరోపణలపై దృష్టి పెడతానని అన్నారు.మాజీ ఎమ్మెల్యే అనుచరులు కొందరు పార్కులకు అభివృద్ధి చేశారని లక్షలు,లక్షలు బిల్లులు స్వహాచేసారని పూర్తి వివరాలు అందించాలని అన్నారు.శిల్పా ప్రముఖ అనుచరుడు పద్మశ్రీ సుబ్బారాయుడు కరోనా సమయంలో టిట్కో గృహాల్లో కరోనా సోకిన వారికి మంచి నీళ్ళు అందించారని 2 కోట్ల బిల్లులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.నంద్యాల మున్సిపాలిటీలో అధికారులు దుర్మార్గమైన పాలన అందిస్తున్నారని త్వరలో పూర్తి ఆధారాలతో ఒకొక్కటీ బయట పెడతానని అన్నారు.ప్రస్తుతం పార్కుల చుట్టూ అపరిశుభ్రంగా ఉన్నాయని దోమల భారిన ప్రజలు పడుతున్నా ఫ్యాగింగ్ చేయడంలేదన్నారు,మున్సిపల్ పార్క్ లో చిన్న చిన్న వ్యాపారాలు ఖాళీ చేయించారని,యోగా సెంటర్ పై ఆరోపణలు వస్తె ఎందుకు ఖాళీ చేయించాలేదని టిడిపి నాయకుడు మణికంఠ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.నంద్యాల మున్సిపాలిటీలో ఎందరో మహానుభావులు చైర్మన్లు గా పనిచేశారన్నారు. ఖాదర బాద్ నరసింహారావు ను రెండవ గాంధీ గా పిలుస్తారని అన్నారు.ఆత్మకూరు నాగభూషణం శెట్టి లాంటి వారు పనిచేసి ప్రజలతో సేహాభాష్ అనిపించుకున్నారని అన్నారు.మంత్రి ఎన్.ఎం.డి.ఫరూఖ్ ఇంత వయసులో సైతం పగలు,రాత్రి అనే భేదం లేకుండా ప్రజల వినూతులు స్వీకరించి పరిష్కారం చేస్తున్నారని అన్నారు.అధికారులు ప్రజలకు పనులు చేయకుండా లంచాల మత్తులో ఉన్నారని అన్నారు.కనీసం కౌన్సిల్ సభ్యులకు కూడా మర్యాద ఇవ్వడం లేదన్నారు.నంద్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న,జరిగిన దోపిడీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళతానని అన్నారు అధికారులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే పారిపోయారన్నారు. వారం లోపు అధికారులపై చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకువెళతానని అన్నారు .ఆయన వెంట కూటమి నాయకులు జనసేనా,టిడిపి,బిజెపి నాయకులు ఉన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News