నంద్యాల లో ఘనంగా జరిగిన జిల్లా స్థాయి చిత్ర లేఖన పోటీలు చిత్ర లేఖన పోటీలకు అపూర్వ స్పందన

On

GridArt_20250209_214009834

నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 09 . (నంది పత్రిక ):నంద్యాల లోని ప్రముఖ చిత్రకారులు చిత్తులూరి రామ్ ప్రసాద్, చింతలపల్లె కోటేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత యం. ఆర్. గోవింద రెడ్డి  మరియు స్వర్గీయ ఆర్. సి. కంభగిరి రాజు ఇరువురు చిత్రకళ లో విశిష్ట సేవలకు జ్ఞాపకర్థం గా 10 వ జిల్లా స్థాయి చిత్ర లేఖన పోటీలు ఆదివారం నంద్యాల లోని రామకృష్ణ డిగ్రీ కళాశాల లోని వివేకానంద అడిటో రియం లో ఉదయం 10 నుండి 1గంట వరకు ఘనంగా జరిగింది. విశ్వ విఖ్యాత నట సార్వ బౌమ నటరత్న నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవ వేడుకలు పురస్కరించుకొని ఎన్టీఆర్ చిత్రాన్ని వేయమని పోటీలకు ఇవ్వడం జరిగింది. దాదాపు 200 మంది పైగా విద్యార్థులు పోటిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధులుగా కళా రాధన అధ్యక్షులు, ప్రధాన కార్య దర్శి డాక్టర్ మధు సూదన్, డాక్టర్ రవికృష్ణ, శ్రీనిధి హోటల్ యజమాని రఘవీర్ పాల్గొన్నారు. ముఖ్య అతిధులు మాట్లాడుతూ భారతీయ కళలో చిత్ర కళ అత్యంత ప్రాచీన మైనది. రాజా రవివర్మ, పద్మశ్రీ బాపు రామాయణం లో మహా భారతం లో ఎన్నో ముఖ్య మైనా ఘట్టలు వేసి మంచి గుర్తింపు పొందారు. విద్యార్థులు చదువు తో పాటు చిత్ర కళలో బాగా రానించాలని చెప్పారు. అలాగే సీనియర్ చిత్రకారులు వెంకటేశ్వర్లు, మరియు రంగనాధ్ కి ఘనంగా సన్మానం చేసారు. అలాగే రఘు వీర్ కి, మధు సుదన్ గారికి రవికృష్ణకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమం నకు వెంకటేశ్వర రాజు,రామిరెడ్డి, ప్రభాకర్, ప్రగతి మేడం,రాముడు, సుంకన్న, వెంకీ ఆర్ట్, వాసు ఆర్ట్ ఓబులేసు,విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాలొగొన్నారు. ప్రధమ బహుమతి రెండు గ్రాములు బంగారం గురు రా ఘువ కార్తీక్ రెండవ బహుమతి 20 గ్రాములు వెండి గణేష్ తృతీయ 10గ్రాములు వెండి రాగ చై త్ర సాధించారు. అంతే కాకుండా 10 మంది విద్యార్థులకు ప్రత్యేక జ్యూరి అవార్డ్స్ ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల కు ప్రధమ అఖిత్ రాయల్ కు 20 గ్రాములు వెండి.రెండవ బహుమతి కావ్యశ్రీ 10 గ్రాములు వెండి సాదించారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News