నంద్యాల ఎస్ డి పి ఐ కార్యాలయంలో ఈ డి సోదాలు - ఏమీ దొరకక ఖాళీ చేతులతో పలయానం చిత్తగించిన ఈ డి అధికారులు

On

GridArt_20250306_225521391

నంది పత్రిక అగ్రికల్చర్ రిపోర్టర్ మార్చి 06:-నంద్యాల ఎస్ డి పి ఐ కార్యాలయంపై ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు Enforcement Directorate (ED) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో అధికారులు కార్యాలయాన్ని పూర్తిగా పరిశీలించి, డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించారు.

అయితే, చాలా గంటల పాటు జరిగిన ఈ తనిఖీల్లో ఎలాంటి అక్రమాలు లభించలేదు. దీనితో ఏమీ దొరకక నిరాశచెందిన ED అధికారులు చివరికి కార్యాలయం నుండి వెనుదిరిగారు. ఈ పరిణామం స్పష్టంగా రాజకీయ కక్షతో ప్రేరేపించబడిన చర్య అని ఎస్ డి పి ఐ నాయకులు మజీద్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఎజాస్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ దాడులు అధికార పార్టీ చేతిలో ED ఒక రాజకీయ ఆయుధంగా మారినట్లు స్పష్టంగా చూపిస్తున్నాయి. వప్పు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎస్ డి పి ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త0గా ప్రజాస్వామ్య బద్దంగా, చేస్తున్న నిరసనలకు భయపడే బిజెపి సంపరివార్ ఈడిని ఉపయోగించుకొని మా ఈ నిరసనలను ఆపాలనుకోవడం వారి మూర్ఖత్వమని తెలిపారు. బిజెపి ప్రభుత్వం చేసే ప్రతి ప్రజావ్యతిరేక పనిని ఎదుర్కోవడంలో ఎస్ డి పి ఐ ముందు వరుసలో ఉంటుందని ఇటువంటి ఈడి , బీడీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు .ఇలాంటి అక్రమ దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారతాయి. మేము ఎప్పటికీ చట్టానికి లోబడి, ప్రజా హితాన్ని కాపాడే విధంగా పనిచేస్తాం అని పేర్కొన్నారు

ఎస్ డి పి ఐ – నంద్యాల అసెంబ్లీ

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 
మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  
శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత
రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి