నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

On

-ఉ.9:30 గం.ల నుండి మ.12:30 గం. వరకే పిజిఆర్ఎస్

 

-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

IMG_20250323_194616

నంద్యాల ప్రతినిధి. మార్చి 23 . (నంది పత్రిక ):ఈ నెల 24వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ సూచనల మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉ.9:30 గం.లకు ప్రారంభించి మ.12:30 గం.లకు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం" కార్యక్రమానికి ఈ నెల 24వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడ పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

జాబ్ మేళ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోవాలి జాబ్ మేళ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోవాలి
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 03 . (నంది పత్రిక ):నంద్యాల 03-04-2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభి వృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గంలోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల...
శ్రీశైలంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలకు పిఎన్టి ల్యాబ్ కు ప్రత్యేక గౌరవం
నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
ఒంగోలు జాతి పశు పోషకులు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి బ్రాండ్ అంబాజర్.. 
అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు
విద్యార్థులకు ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ చాలా ముఖ్యము