నేర రహిత సమాజమే పోలీసుల అంతిమ ధ్యేయం.
నేర శాతం తగ్గింపుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలి.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
కేసముద్రం, ఫిబ్రవరి 19(నంది పత్రిక): సమర్థవంతమైన పోలీసు వ్యవస్థలో పోలీసులు ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో లో ఉండాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత పోలీస్ స్టేషన్ వారీగా నేర నియంత్రణ, కేసుల విచారణ తీరు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో వారికి ఎదురవుతున్న సమస్యలను కూలంకషంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి పలు విలువైన సూచనలు ఇచ్చారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రోత్సహకాలు అందజేసారు.
Comment List