నెరవాటి టి బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారుల ప్రతిభ
నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 16 . (నంది పత్రిక ):నంద్యాల పట్టణంలోని నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు, రాష్ట్రస్థాయిలో ప్రఖ్యాతి కాంచినట్లు నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వాహకులు,
శ్రీనివాస గుప్తా, నెరవాటి వినోద్ కుమార్, నెరవాటి చిన్న లక్ష్మయ్యలు మరియు కోచ్ సాయినాథ్ రెడ్డి, చిన్న లు తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
గడ్డం లికిత్ కరుణాకర్ రావు
గత నెల వైజాగ్ లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో పాలిటెక్నిక్ ఐపీఎస్ జిఎం గేమ్స్ రాష్ట్రస్థాయిలో దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలో గడ్డం లికిత్ కరుణాకర్ రావు వెండి పతకం సాధించారు. అలాగే సౌజోన్ కు సెలెక్ట్ అయ్యారు.గడ్డం చైత్రికారావు గత నెల మలికిపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు, గడ్డం చైత్రిక రావు క కాంస్య పథకం సాధించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాస గుప్తా ,నెరవాటి వినోద్ కుమార్ ,నెరవాటి చిన్న లక్ష్మయ్యలు మరియు కోచ్ సాయినాథ్ రెడ్డి చిన్న లు ఆదివారం సమావేశం నిర్వహించి క్రీడాకారులను అభినందించి ఉన్నత స్థాయిలో చేరుకోవాలని అన్నారు. అలాగే తల్లిదండ్రులుగడ్డం చంద్రశేఖర రావు గడ్డం, రేఖాదేవి ఆనంద వ్యక్తం చేశారు.
Comment List