శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 21 . (నంది పత్రిక ):శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవమును నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషల వ్యాప్తిని ప్రోత్సహించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా భాషా మరియు సాంస్కృతిక సంప్రదాయాల గురించి పూర్తి అవగాహన కల్పించడానికి అంతేగాక అవగాహన, సహనము మరియు సంభాషణ ఆధారంగా సంఘీభావాన్ని ప్రేరేపించడానికి దినోత్సవాన్ని నిర్వహించాలని 1999 వ సంవత్సరము యునెస్కో ప్రకటించింది. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటిని రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనము జీవవైవిద్యాన్ని కాపాడుకోగలమని తెలియజేశారు. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు అయితే వాటి ప్రభావము మాతృభాషపై పడకుండా చూసుకోవాలని, మాతృభాషను పరిరక్షించుకోవాలన్నారు. మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే మిగిలిన భాషలు నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గమని, ఈ కర్తవాన్ని గుర్తు చేసేందుకే ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నాగరాజు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Comment List